సుప్రీంకోర్టులో వరవరరావుకు ఊరట...

By Arun Kumar PFirst Published Aug 29, 2018, 6:11 PM IST
Highlights

భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టులు కాకుండా గృహనిర్భందాలు మాత్రమే విధించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అత్యున్నత దర్మాసనం జారీ చేసింది.

భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టులు కాకుండా గృహనిర్భందాలు మాత్రమే విధించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అత్యున్నత ధర్మాసనం జారీ చేసింది.

ఇప్పటికే ఈ కేసులో విప్లవ కళాకారుడు వరవరరావు, గౌతమ్ నఖావాలేలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుణే పోలీసుల కస్టడీలో వున్న వీరు సుప్రీ కోర్టు ఆదేశాలతో బైటికిరానున్నారు. వీరి అక్రమ అరెస్టులను ఖండిస్తూనే పౌరహక్కుల నేతలు సుప్రీం ను ఆశ్రయించారు. ఈ కేసును ఇవాళ విచారించిన కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. 

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సెప్టెంబర్ 5 వరకు గృహనిర్భందం విధించవచ్చని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. దీంతో పోలీసుల కస్టడీ నుండి వీరిద్దరు విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికి గృహనిర్భందం తప్పేలా లేదు.

సంబంధిత వార్తలు చదవండి

40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

వరవరరావు అరెస్టు: కంట తడి పెట్టిన భార్య హేమలత

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

వీవీ పత్రికకు ఎడిటర్‌ను, కేసుతో సంబంధం లేదు: జర్నలిస్ట్ క్రాంతి అరెస్ట్

click me!