రేపు మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

Published : Aug 29, 2018, 05:17 PM ISTUpdated : Sep 09, 2018, 11:14 AM IST
రేపు మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

సారాంశం

మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నాడు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు  అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నాడు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు  అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ  బుధవారం నాడు  ఉదయం అన్నెపర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  హరికృష్ణ అంత్యక్రియలను తొలుత ఫాం‌హౌస్‌లో నిర్వహించాలని భావించారు.

కానీ, గురువారం సాయంత్రం  మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్  సీఎస్ ఎస్‌కే జోషీని ఆదేశించారు.

గురువారం సాయంత్రం హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  అంత్యక్రియల ఏర్పాట్ల గురించి కుటుంబసభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?