
హైదరాబాద్ : హైదరాబాద్ రామాంతపూర్ లోని నారాయణ జూనియర్ కాలేజీ దగ్గర ఉద్రిక్తకర వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో వారితోపాటు కాలేజీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. నారాయణ కాలేజీ వద్ద ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ పోసుకుని విద్యార్థుల పేరెంట్స్ ఆత్మహత్యాయత్నం చేశారు.
వారిని అడ్డుకోవడానికి నారాయణ కాలేజీ సిబ్బంది.. చుట్టూ ఉన్నవారు ప్రయత్నించాు. దీంతో కాలేజీ సిబ్బందితోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేరెంట్స్ ఆత్మహత్యాయత్నంతో కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Telangana: స్కూల్ ఫీజు పెంపు పరిమితిపై కీలక నిర్ణయం !