Munugogde bypoll 2022: రేపు మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్రలకు కోమటిరెడ్డి దూరం

By narsimha lodeFirst Published Aug 19, 2022, 1:04 PM IST
Highlights

మునుగోడులో రేపు నిర్వహించే పాదయాత్రలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండనున్నారు.ఈ పాదయాత్రల విషయమై తనకు సమచారం లేదని వెంకట్ రెడ్డి చెబుతున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మునుగోడు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపటి నుండి నిర్వహించే పాదయాత్రలకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. అయితే ఈ పాదయాత్రలకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం  ఆహ్వానం అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సమాచారం ఇచ్చారని   పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ తనరకు సమాచారం అందని కారణంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని 170 గ్రామాల్లో  పాదయాత్రలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.  రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  కరోనా నుండి కోలుకున్న రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన మునుగోడుకు వెళ్లనున్నారు. రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా పార్టీ స్థితిగతులపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు.

ఈ పాదయాత్రల గురించి తనకు సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ పాదయాత్రలకు దూరంగా ఉండనున్నారు.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగిస్తే తాను మునుగోడులో ఎన్నికల ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ప్రకటించారు. 

మునుగోడులో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఒప్పించేందుకు ఎఐసీసీ సెక్రటరీ బోసురాజు ప్రయత్నాలు మొదలు పెట్టారు.   ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ చీప్ సోనియా గాంధీకే ఫిర్యాదు చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావిస్తున్నారు.ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరిన  విషయం తెలిసిందే.

also read:Munugode bypoll 2022: రేపు మునుగోడుకు రేవంత్ రెడ్డి, 22 నుండి మండలాల వారీగా సమీక్ష

ఈ నెల 2వ తేదీన ఏర్పాటు  చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి మండిపడ్డారు.ఈ వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. అంతేకాదు తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా కోరారు.  ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని ప్రకటించారు. హోంగార్డు , ఐపీఎస్ వ్యాఖ్యల విషయమై రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అద్దంకి దయాకర్  చండూరు సభలో చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యల విషయమై రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ లు వేర్వేరుగా క్షమాపణలు చెప్పారు.

click me!