మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకొని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.. తమ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే టికెట్లు బుక్ చేసకున్నారని చెప్పారు.
హైదరాబాద్: మునావర్ ఫరూఖీని వేదిక వద్దే దాడి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ధర్మం కోసం అవసరమైతే పార్టీకి కూడా దూరమయ్యేందుకు తాను సిద్దంగా ఉన్నానని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు.
మునావర్ ఫరూఖీ షో కి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.రేపు హైద్రాబాద్ లో ఈ షో ను నిర్వహించనున్నారు. ఈ షో నిర్వహించవద్దని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. మునావర్ ఫరూఖీ షో నిర్వహిస్తే అడ్డుకొంటామని గతంలో తాము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని రాజాసింగ్ పునరుద్థాటించారు.
undefined
also read:హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ కామెడీ షో: అనుమతించిన తెలంగాణ సర్కార్
చాలా రాష్ట్రాల్లో మునావర్ ఫరూఖీ షో లను ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు. అన్ని పార్టీలు కూడా ఈ విషయమై ఏకతాటిపైకి రావడంతో చాలా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఎందకు మునావర్ ఫరూఖీ షో ని ప్రభుత్వం అనుమతించిందో చెప్పాలని ఆయన కోరారు. రాముడి, సీతను దూషించిన మునావర్ ఫో ను రాష్ట్రంలో నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడ ఆయన ప్రశ్నించారు. మునావర్ కాకుండా వేరే హాస్య కళాకారుడితో షో నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో తాము పాల్గొంటామన్నారు. కానీ ఈ షోకి అనుమతివ్వద్దని తాము కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
తన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరించలేదని రాజాసింగ్ చెప్పారు. ధర్మం కోసం తాను ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించినా కూడా తనకు బండి సంజయ్ కూడా సహరిస్తున్నారని చెప్పారు.చిన్పప్పటి నుండి ధర్మం కోసం తాను పోరాటం చేస్తున్నట్టుగా చెప్పారు. అమిత్ షా కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతుందని కొందరు పార్టీ నేతలు ఈ విషయమై తనతో మాట్లాడారన్నారు. కానీ ధర్మం కోసం తన పని తన పని చేస్తానని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే తమ పార్టీకి చెందిన కార్యకర్తలు మునావర్ ఫరూఖీ షో లో పాల్గొనేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారని రాజాసింగ్ చెప్పారు. షో లో నే మునావర్ పై తమ వారు దాడి చేస్తారని రాజాసింగ్ హెచ్చరించారు. మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకొంటామని హెచ్చరించడంతో రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాజాసింగ్ ఇంటి నుండి బయలకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.