
తెలంగాణాలో విద్యార్ధుల ఆధ్వర్యంలో ఓ పార్టీ పురుడు పోసుకున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణం వేదికగా డెమోక్రట్ స్టూడెంట్స్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఏర్పాటైంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్ధుల ప్రగతిని ఆశిస్తూ పార్టీని ఏర్పాటు చేసినట్లు విద్యార్ధి నేత చెన్నయ్య ప్రకటించారు.
ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంత విద్యార్ధుల అభ్యున్నతి కోసం ఒక్క పార్టీ కూడా పనిచేయటం లేదని ఆరోపించారు. తాము ఏర్పాటు చేసిన పార్టీ కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్ధుల్లోని నాయకత్వం ఎదుగుదల కోసమే పాటు పడుతుందని చెప్పారు.