సీఎం మా ఇంటికొస్తే ఆ అన్నమే పెడతా

Published : Dec 28, 2016, 11:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
సీఎం మా ఇంటికొస్తే ఆ అన్నమే పెడతా

సారాంశం

ప్రతిపక్ష నేత జానారెడ్డి

సీఎం కేసీఆర్ భోజనం పథకం బాగానే పనిచేస్తోంది. నిన్న కేసీఆర్ అసెంబ్లీ లో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జానా రెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని తన ఆకాంక్షను వెల్లిబుచ్చారు.

 

దీనిపై బుధవారం జానా స్పందించారు.  సీఎం తన ఇంటికి భోజనానికి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తానని చెప్పారు.  అయితే ఇప్పటి వరకు  సీఎం వస్తున్నట్లు సమాచారం రాలేదని చమత్కరించారు.

 

ఒక వేళ సీఎం నిజంగా మా ఇంటికి భోజనానికి వస్తే వరి అన్నం కాకుండా జొన్న అన్నం పెడతానని తెలిపారు.

 

కాగా, తన పనితీరు బాగోలేదని పార్టీ లో ఎవరూ తనతో  చెప్పలేదని అన్నారు. ఎవరికైనా సీఎల్పీ పదవిపై ఆసక్తి ఉంటే తనకు చెప్పాలని సూచించానని పేర్కొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ యువతికి జర్మనీలో భారీ ఉద్యోగం.. నెలకు రూ.3.5 లక్షల జీతం
హైద‌రాబాద్‌లో కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్‌.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్