కెసిఆర్ ప్రభుత్వానికి కోదండరామ్ కొత్త సవాల్

Published : Dec 28, 2016, 03:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కెసిఆర్ ప్రభుత్వానికి కోదండరామ్  కొత్త సవాల్

సారాంశం

మరో తెలంగాణా ఉద్యమానికి సన్నద్ధమవుతున్నకోదండరామ్ తాజా గా ఇపుడు జోనల్ వ్యవస్థను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తున్నారు

ప్రొ. కోదండరామ్ కు మళ్లీ కోపం వచ్చింది. స్థానికుల ఉద్యోగాలలో భద్రతకు భరోసా కల్పించే  జోనల్ వ్యవస్థ రద్దుచేయడం కుదరదు  అంటున్నారు.  అసమనాతులున్న చోట జోనల్ వ్యవస్థ అవసరమని, దానిని  కొత్త జిల్లాలను దృష్టిలో పెట్టుకుని పునర్వ్యవస్థీకరించాలని చెబుతున్నారు.

 

ముఖ్యమంత్రి కెసిఆర్  వైద్యం తెలంగాణా జబ్బులను నయం చేయలేకపోతున్నదని , డాక్టర్ ను మర్చాల్సి వస్తుందేమో నని  టిజెఎసి నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు.

 

వైద్యం ఎక్కడ ఫెయిలవుతున్నదో ఆయన భూసేకరణ దగ్గరనుంచి పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న ప్రయివేటు యూనివర్శిటీల దాకా వేలెత్తిచూపుతూ వస్తున్నారు.  ఈ జాబితాలోకి ఇపుడు మరొక  నిర్ణయం వచ్చి పడింది.  అదే జోనల్ వ్యవస్థ రద్దు. ఇది తప్పని ఆయన ప్రకటించారు.  నిన్న జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ ఎలా తప్పో వివరించారు.

 

మరో తెలంగాణా  అయన నినాదం. కెసిఆర్ నిర్మిస్తున్న తెలంగాణా ప్రజల తెలంగాణా కాదు, అది ఆంద్రోపాలకుల తెలంగాణా, కాంట్రాక్టర్ల తెలంగాణా అంటున్నారు. అందుకే ప్రజా తెలంగాణా అంటూ వూరూర జెఎసిలను మరో తెలంగాణా ఉద్యమం నడిపేలా పునర్వ్యవస్థీకరిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఆయన  సర్పంచుల ఉద్యమానికి కూడా మద్దతు తెలిపారు. రాజ్యంగం హామీ ఇచ్చిన హక్కులన్నంటిని తమకు కల్పించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి మద్దతుతో ఆయన మరో తెలంగాణా ఉద్యమం పంచాయతీలన్నింటిదాకా ప్రాకింది. సర్పంచుల ధర్నాలో కూడా పాల్గొన్నారు.

 

ఇపుడు వెనకబడిన ప్రాంతాల మేలు కోసం తెచ్చిన జోనల్ వ్యవస్థ రద్దు ను వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం వేరు. అది రాజకీయ వ్యూహం. ప్రొఫెసర్ కోదండరామ్ వ్యతిరేకించడం వేరు. ఇది ప్రజా సమీకరణ.

 

ఇపుడు జోనల్ వ్యవస్థ గురించి ఫ్రొఫెసర్ కోదండరామ్ ఎమంటున్నారో చూద్దాం:

 

ఎవ్వరితోనూ చర్చించకుండా ఒంటెత్తు పోకడతో ప్రభు త్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఇదొకటి.రాష్ట్రం అంతటా ఒకే తరహా ఆర్థిక, సామాజిక పరిస్థితి లేనందువల్లే జోనల్‌ వ్యవస్థ ఉంటేనే వెనకబడిన ప్రాంతాలకు న్యాయం జరగుతుంది.

 

ముల్కీ నిబంధనలు, సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా క్రమంగా జోనల్‌ వ్యవస్థగా రూపుదిద్దుకుందని  గిర్‌గ్లానీ తరహాలో వెంటనే ఒక కమిషన్ వేయాలి. కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో జోనల్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పునర్వ్యవస్థీకరించాలని, కాకపోతే,  స్థానికిత కోసం ఇపుడున్న నాలుగేళ్ల విద్యాభ్యాసం లేదా నివాస నియమాన్ని పదేళ్ల పెంచవచ్చని ఆయన అన్నారు. 371(డి) రద్దు చేస్తే అన్ని ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలవుతాయని అదినష్టమని అయన అన్నారు.

 

ఆయన ఆగ్రహం ఏరూపం తీసుకుంటుందో చూద్దాం.

 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?