హైదరాబాద్ నడిబొడ్డున భారీ బండరాళ్ల లారీ బోల్తా... తప్పిన పెనుప్రమాదం

Published : Jun 26, 2023, 04:17 PM ISTUpdated : Jun 26, 2023, 04:21 PM IST
హైదరాబాద్ నడిబొడ్డున భారీ బండరాళ్ల లారీ బోల్తా... తప్పిన పెనుప్రమాదం

సారాంశం

హైదరాబాద్ నడిబొడ్డున నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా వుండే రోడ్డుపై బండరాళ్లతో కూడిన లారీ బోల్తా పడింది.  

హైదరాబాద్ : భారీ బండరాళ్లతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. సంపన్నులు నివాసముండే మాదాపూర్ ప్రాంతంలోని రద్దీ రోడ్లపై ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీలోని బండరాళ్లు రోడ్డుపై పడినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. 

మాదాపూర్ నుండి హైటెక్ సిటీ మీదుగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ వైపు భారీ బండరాళ్లతో ఓ టిప్పర్ లారీ బయలుదేరింది. అయితే రోడ్డుపై వాహనాల మధ్య వుండగానే లారీ అదుపుతప్పి బోల్తాపడింది.దీంతో లారీలోని బండరాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కానీ ఈ రాళ్ళేవి ఇతర వాహనాలపై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Read More  పెద్దపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం... 40మంది పెళ్లిబృందంతో కూడిన బస్సు బోల్తా (వీడియో)

రద్దీగా వుండే రోడ్డుపై బండరాళ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. రోడ్డుపై పడిపోయిన బండరాళ్లను పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!