కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం కానుందా?.. మాణిక్ రావ్ ఠాక్రే ఏమన్నారంటే..

By Sumanth KanukulaFirst Published Jun 26, 2023, 4:04 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టనున్నట్టుగా వార్తలు వెలువడుతున్నట్టుగా సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీని విలీనం చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టనున్నట్టుగా వార్తలు వెలువడుతున్నట్టుగా సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీని విలీనం చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారంపై టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పందించారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై తనకు సమాచారం లేదని అన్నారు. ఇది అధిష్టానం పరిధిలోని అంశమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానంతో వైఎస్ షర్మిల టచ్‌లో ఉన్నారో? లేదో? తనకు తెలియదని చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. 
సర్వేలు, గెలుపు అవకాశాల ప్రతిపాదికను బట్టే ఎవరికైనా టికెట్లు ఇస్తామని తెలిపారు. పార్టీలో అందరూ నేతలు తనను కలుస్తారని.. వారితో చర్చించడం తన  బాధ్యత అని అన్నారు. 

Latest Videos

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలపై కూడా మాణిక్ రావ్ ఠాక్రే స్పందించారు. మహారాష్ట్రకు వెళ్లడం వల్ల కేసీఆర్‌కు ఒరిగేదేమి లేదని అన్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లో చేరేవారి వల్ల తమకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్‌లు ఒకటేనని.. బీఆర్ఎస్ అనేది  బీజేపీ బీ టీమ్ అని విమర్శించారు. ఈ విషయం  తెలంగాణ  ప్రజలకు కూడా తెలుసునని అన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల మీడియాతో చిట్‌చాట్ సందర్భంలో మాత్రం ఠాక్రే.. వైఎస్‌ షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లో ఉందని చెప్పారు. 

click me!