ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

Published : Sep 19, 2018, 06:59 PM ISTUpdated : Sep 19, 2018, 07:05 PM IST
ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

సారాంశం

ఇటీవల పెళ్లి చేసుకున్న మాధవి, సందీప్ లపై అందరూ చూస్తుండగానే మాధవి తండ్రి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి చేసిన మనోహరాచారి పోలీసులకు లొంగిపోయాడు.

హైదరాబాద్: తండ్రి మనోహరాచారి దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మెడపై కత్తితో దాడి చేయడంతో మెడ నుంచి నరాలకు వెళ్లే నరాలు దెబ్బ తిన్నాయని వైద్యులు చెబుతున్నారు. 

మాధవి ఎడమ చేయి సగం తెగిపోయిందని కూడా చెప్పారు. ఇటీవల పెళ్లి చేసుకున్న మాధవి, సందీప్ లపై అందరూ చూస్తుండగానే మాధవి తండ్రి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి చేసిన మనోహరాచారి పోలీసులకు లొంగిపోయాడు.

 తీవ్రంగా గాయపడిన సందీప్ నీలిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో మనోహరాచారి దాడి చేసినట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు.  పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని అంటున్నారు. త్వరలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేద్దామని ఇరు కుటంబాలు అనుకున్నాయి. ఒకరింటికి మరొకరు వచ్చి పోతున్నారని కూడా పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch