ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

By narsimha lodeFirst Published Sep 19, 2018, 6:29 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. 


హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. కొత్త పీసీసీ కమిటీతో పాటు 9 అనుబంధ విభాగాలను కూడ కూడ ఆ పార్టీ ప్రకటించింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డికి దక్కింది. రేవంత్ రెడ్డితో పాటు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కూడ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ గా ఉన్న మల్లు భట్టివిక్రమార్కకు క్యాంపెయిన్ కమిటీ ఛైర్మెన్ పదదవి దక్కింది.

రేవంత్‌రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. టీపీసీసీలో‌ రెండు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు మరో 9 కమిటీలను ఏర్పాటు చేశారు. క్యాంపెయిన్ కమిటీకి ఛైర్మెన్ గా మల్లు భట్టి విక్రమార్కకు  బాధ్యతలు కేటాయించారు.  కో ఛైర్మెన్ గా డీకే అరుణకు  బాధ్యతలు ఇచ్చారు.  మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్ గా  దామోదర రాజనర్సింహ్మకు బాధ్యతలు ఇచ్చారు. కో ఛైర్మెన్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బాధ్యతలను కట్టబెట్టారు. 

కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ ఛైర్మెన్ గా  వి. హనుమంతరావుకు బాధ్యతలను కేటాయించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ గా కోదండరెడ్డికి చోటు దక్కింది.  ఈసీ సమన్వయ కమిటీ ఛైర్మెన్ గా  మర్రిశశిధర్ రెడ్డిని నియమించారు.

15 మందితో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్  కమిటీలో చోటు కల్పించారు.41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే  ఇటీవలనే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన  కేఆర్ సురేష్ రెడ్డికి మూడు కమిటీల్లో స్థానం కల్పించారు. 


 

click me!