గవర్నర్ తో కేటీఆర్ భేటీ... మెట్రో ప్రారంభంపై ట్వీట్

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 6:58 PM IST
Highlights

కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ అమీర్ పేట-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ నెల 24 వ తేదీన 12.15 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందంటూ మంత్రి ట్వీట్ చేశారు. 
 
నగరవాసుల ట్రాపిక్ కష్టాలను తీర్చడానికి హైదరాబాద్ లో చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టు మెట్రో రైలు. ఈ మెట్రో ప్రాజెక్టు పిపిపి (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్దతిలో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ - నాగోల్ మార్గాల్లో గత సంవత్సరమే అందుబాటులోకి వచ్చింది. అయితే దీని తర్వాత ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఎదురుచూస్తున్న అమీర్ పేట-ఎల్బీనగర్ మార్గం త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ అమీర్ పేట-ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ నెల 24 వ తేదీన 12.15 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందంటూ మంత్రి ట్వీట్ చేశారు. 

Happy to announce that Hon’ble Governor Sri ESL Narasimhan Garu has consented to flag off the Ameerpet - LB Nagar metro line on 24th Sep at 12:15pm pic.twitter.com/TsbA1tQGHE

— KTR (@KTRTRS)

click me!