హైద్రాబాద్ మన్నెగూడలో నకిలీ ఆర్టీఓ: అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు

Published : Jul 05, 2023, 11:31 AM ISTUpdated : Jul 05, 2023, 11:36 AM IST
హైద్రాబాద్ మన్నెగూడలో  నకిలీ ఆర్టీఓ: అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు

సారాంశం

హైద్రాబాద్ మన్నెగూడలో ఆర్టీఓ  కార్యాలయంలో నకిలీ ఆర్టీఓతో ఆయనకు సహకరిస్తున్న ఆరుగురిని  ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్: నగరంలోని మన్నెగూడ ఆర్టీఓ కార్యాలయంలో బుధవారంనాడు ఉదయం  ఎస్ఓటీ  పోలీసులు  సోదాలు  చేశారు.  నకిలీ  ఆర్టీఓ అధికారితో పాటు  ఆయనకు సహకరిస్తున్న ఆరుగురిని  ఎస్ఓటీ  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కంప్యూటర్లు, నకిలీ  సర్టిఫికెట్లను  ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు.

నకిలీ పత్రాలతో  వాహనాల  ఇన్సూరెన్స్,  వాహనాల రిజిస్ట్రేషన్  చేస్తున్నారు.  ఈ విషయమై  కచ్చితమైన సమాచారం ఆధారంగా  ఎస్ఓటీ  పోలీసులు  ఇవాళ  మన్నెగూడ  ఆర్టీఓ  కార్యాలయంలో  సోదాలు  నిర్వహించారు. ఈ ముఠా  ఇప్పటివరకు  ఎన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసింది,  ఎన్ని వాహనాలకు  ఇన్సూరెన్స్ చేసిందనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం