కేంద్ర కేబినెట్ భేటీ: కిషన్ రెడ్డి దూరం, రాజీనామా చేస్తారా?

By narsimha lode  |  First Published Jul 5, 2023, 11:18 AM IST


కేంద్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు.  కిషన్ రెడ్డి  కేంద్ర మంత్రి పదవికి  రాజీనామా చేశారా అనే  చర్చ కూడ సాగుతుంది. 



న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశానికి  కిషన్ రెడ్డి  దూరంగా ఉన్నారు.  బుధవారంనాడు  ఉదయం  మోడీ అధ్యక్షతన  కేబినెట్ సమావేశం  ప్రారంభమైంది.  అయితే  ఈ సమావేశానికి  కిషన్ రెడ్డి హాజరు కాలేదు.  న్యూఢిల్లీలోనే  కిషన్ రెడ్డి  ఉన్నప్పటికీ  ఆయన కేబినెట్ సమావేశానికి  హాజరు కాకపోవడం  చర్చ సాగుతుంది.   కేబినెట్ సమావేశానికి  హాజరు కాకపోవడంతో మంత్రి పదవికి  కిషన్ రెడ్డి  రాజీనామా చేశారా  అనే చర్చ కూడ ప్రారంభమైంది.  

అయితే  ఈ విషయమై  కిషన్ రెడ్డి కానీ, ఆయన వర్గీయుల నుండి  స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే  కిషన్ రెడ్డి  అధికారిక నివాసంలో ఉన్నప్పటికీ  పర్యాటకశాఖకు  చెందిన  అధికారులు  రాకపోవడం చర్చకు దారి తీసింది.   కేబినెట్  సమావేశం ముగిసిన  తర్వాత ప్రధానిని కలిసి  కిషన్ రెడ్డి  రాజీనామాను  అందిస్తారా అనే  చర్చ కూడ లేకపోలేదు.   వచ్చే లోక్ సభ ఎన్నికలు,  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను  దృష్టిలో ఉంచుకొని బీజేపీ  జాతీయ నాయకత్వం  సంస్థాగత మార్పులకు  శ్రీకారం చేసింది.  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డిని  బీజేపీ నాయకత్వం  నిన్న నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై  కిషన్ రెడ్డి  స్పందించలేదు.

Latest Videos

also read:తెలంగాణ బీజేపీకి మరో షాక్.. అధ్యక్ష బాధ్యతలకు కిషన్ రెడ్డి విముఖత? పదవిపై మాట్లాడటానికి నిరాకరణ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  నియమిస్తూ  నిన్న  పార్టీ జాతీయ నాయకత్వం నియమించిన  సమయంలో  కిషన్ రెడ్డి  హైద్రాబాద్ లోనే  ఉన్నారు.  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షపదవి విషయమై  మాట్లాడేందుకు  కిషన్ రెడ్డి నిరాకరించారు.హైద్రాబాద్ నుండి  కిషన్ రెడ్డి హుటాహుటిన  న్యూఢిల్లీకి చేరుకున్నారు.  ఇవాళ ఉదయం నుండి  కిషన్ రెడ్డి  నివాసానికి  విజిటర్లను అనుమతించడం లేదు.ఇవాళ ఉదయం నుండి  కిషన్ రెడ్డి  కార్యాలయానికి వచ్చిన అధికారులు కూడ తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు  చూస్తే  కిషన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయనే  ప్రచారం సాగుతుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి చేపట్టనున్నందున  కేబినెట్ మంత్రి పదవికి  ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితులు  నెలకొన్నాయనే  అభిప్రాయాలను  పార్టీ నేతలు కొందరు వ్యక్తం  చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తీసుకొనేందుకు కిషన్ రెడ్డి  సిద్దంగా  లేరనే ప్రచారం సాగుతుంది. 

click me!