దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడు విహాన్ మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడు విహాన్ మరణించాడు. దీనితో కలిపి ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. దోమలగూడ రోజ్ కాలనీకి చెందిన బోయకర్ పద్మ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే బోనాల పండుగ కావడంతో కూతురు, అల్లుడు, బంధువులను ఇంటికి ఆహ్వానించింది. అందరూ సంతోషంగా పిండి వంటలు చేసుకుంటూ వుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఇళ్లు మొత్తం దగ్థమైంది.
Also Read: హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు: చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి
ఆ సమయంలో ఇంట్లో వున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆనంద్, నాగమణి, పద్మ, ధనలక్ష్మీ, చిన్నారులు అభినవ్, శరణ్య, విహాన్‌గా గుర్తించారు. వీరందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న చిన్నారి శరణ్య మృతి చెందగా.. ఆ తర్వాత నాగమణి, ధనలక్ష్మీ, అభి మరణించారు. తాజాగా విహాన్ కూడా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.