ప్లెక్సీ వివాదం .. సామాన్యుడి ఇంటి మీదకెళ్లిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పోలీసుల ముందే దాడి

Siva Kodati |  
Published : Jul 16, 2023, 07:01 PM IST
ప్లెక్సీ వివాదం .. సామాన్యుడి ఇంటి మీదకెళ్లిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పోలీసుల ముందే దాడి

సారాంశం

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి ఇంటి మీదకు తన అనుచరులతో వెళ్లి దాడి చేశారు. ఆదివారం బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ వెంగళరావ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ నిలదీశారు. మాగంటి ఎదుటే ఆయన అనుచరులు సదరు వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పక్కనే పోలీసులు వున్నప్పటికీ వారు మౌనం దాల్చినట్లుగా తెలుస్తోంది. అయితే మాగంటి గోపీనాథ్ అనుచరులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?
Balapur Ganesh Laddu: హిస్టరీ క్రియేట్ చేసిన బాలాపూర్ లడ్డూ వేలం.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?