నయీం కేసులో ఇరుక్కున్న కీలక నేత

First Published Mar 5, 2017, 11:27 AM IST
Highlights

నయీమ్‌తో సంబంధాలున్నట్లు విద్యాసాగర్ రావు ఒప్పుకున్నారు.

 

గ్యాంగ్ స్టర్, రౌడీషీటర్ నయీం కేసు నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకులకు నయీంతో అవినాభావ సంబంధం ఉందనే ఆధారాలు భయపడటంతో దీనిపై విచారణకు ప్రభుత్వం కూడా కాస్త వెనకడుగు వేస్తోంది.

 

అయితే నయీంతో కొందరికి ఉన్న అనుబంధంపై పక్కా ఆధారాలున్న విషయం రుజువులతో సహా బయటపడటంతో వారిపై చర్యలు తీసుకోకతప్పడం లేదు.

 

ముఖ్యంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుకు నయీంతో ఉన్న అనుబంధంపై పోలీసుల వద్ద బలమైన ఆధారాలున్నాయి. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

 

సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. గతంలోనే ఆయనను ఈ విషయంపై రెండుసార్లు విచారించిన విషయం తెలిసిందే.

 

విచారణలో నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారు.

 

అంతేకాకుండా తనకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు విద్యాసాగర్ రావు ఒప్పుకున్నారు. విచారణలో భాగంగా ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.

 

నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్ రావును సిట్ ప్రశ్నించింది.

click me!