హైదరాబాద్ లో షాకింగ్ ఘ‌ట‌న‌.. గొడవపడి తండ్రిని చంపిన త‌న‌యుడు

Published : Apr 06, 2023, 12:31 PM IST
హైదరాబాద్ లో షాకింగ్ ఘ‌ట‌న‌..  గొడవపడి తండ్రిని చంపిన త‌న‌యుడు

సారాంశం

Hyderabad: మ‌ద్యానికి బానిసైన ఓ తండ్రితో గొడ‌వ‌ప‌డి ఆయ‌న ప్రాణాలు తీశాడు ఓ త‌న‌యుడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసు వర్గాలు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నాయి.   

Youth strangles dad to death: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌ద్యానికి బానిసైన ఓ తండ్రిని క‌న్న కొడుకు క‌డ‌తేర్చాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. కుల్సుంపూరాలో బుధ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

ఈ హ‌త్య గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మద్యానికి బానిసైన త‌న‌ తండ్రితో జ‌రిగిన గొడవలో ఓ యువకుడు.. తండ్రి గొంతు నులిమి హత్య  చేశాడు. ఈ షాకింగ్ ఘటన కుల్సుంపురాలోని కార్గిల్ నగర్ లో చోటుచేసుకుంది. మృతుడిని నక్కా వెంకటేష్(50)గా గుర్తించారు. కుల్సుంపురా స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి.అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బుధ‌వారం రాత్రి 11 గంటల సమయంలో నక్కా సాయికుమార్ ఫుడ్ డెలివ‌రీ బాయ్ గా ప‌నిచేస్తున్నాడు. ఫుడ్ డెలివరీ ప‌ని ముగించుకుని ఇంటికి వచ్చిన త‌ర్వాత తండ్రికొడుకుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఆవేశంలో సాయికుమార్ తండ్రి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ఈ హ‌త్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా సాయికుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడని, అప్పుడప్పుడు మద్యం మత్తులో వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని అశోక్ కుమార్ తెలిపారు.

జ‌న‌గామ‌లో.. 

జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య  చనిపోయిందన్న మనస్థాపంతో ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ భార్య స్వరూప ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. భార్య స్వరూప మృతి నేపథ్యంలో శ్రీనివాస్ కన్నీరుమున్నీరుగా  విలపించారు.  ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్.. తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu