ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్.. హనుమాన్ శోభాయాత్రకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

Published : Apr 06, 2023, 12:21 PM ISTUpdated : Apr 06, 2023, 12:40 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్.. హనుమాన్ శోభాయాత్రకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే‌ రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్‌: గోషామహల్ ఎమ్మెల్యే‌ రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో జరిగే హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం  చేశారని రాజాసింగ్‌పై కేసు నమోదైన సంగతి  తెలిసిందే. 

అయితే  హనుమాన్ శోభాయాత్రకు వెళ్లకుండా తనను  అరెస్ట్ చేశారని రాజాసింగ్ తెలిపారు. హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. హిందువులను జైళ్లలో పెట్టడమే కేసీఆర్ సర్కార్ లక్ష్యం అని విమర్శించారు. తాను ర్యాలీలో పాల్గొంటే వచ్చే ఇబ్బంది ఏమటని ప్రశ్నించారు. తన వల్ల శోభాయాత్రలో ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందా? అని ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?