ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
ఖమ్మం: తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే కిలో తరుగు కూడ లేకుండా పంట కొనుగోలు చేస్తామని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. ఖమ్మంలో ఆదివారంనాడు నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఆబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అంటూ కేసీఆర్ చేసుకునే ప్రచారాన్ని ఈటల రాజేందర్ ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ల వరకు రైతు రుణమాఫీని పూర్తి చేయలేదన్నారు. కానీ ఎన్నికల్లో ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరనే ఉద్దేశ్యంతో రుణమాఫీ చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకు అమిత్ షా ఖమ్మం సభకు వచ్చారన్నారు.
also read:వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్: ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్
రైతుల భూములు, ఔటర్ రింగ్ రోడ్డు భూములు విక్రయించి పంట రుణ మాఫీ చేశారని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందించే అన్ని సబ్సిడీలను ఎత్తేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాల సబ్సిడీలను అందించనున్నట్టుగా ఈటల రాజేందర్ చెప్పారు. బంగారు తెలంగాణ మాటల్లోనే కాదు.. చేతల్లో లేదన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. బంగారు తెలంగాణ మాటల్లోనే చేతల్లో లేదన్నారు.