సంక్రాంతికి స్వగ్రామాలకు జనం: ప్రయాణీకుల పాట్లు,టోల్ ప్లాజాల వద్ద వాహనాల జామ్

By narsimha lode  |  First Published Jan 13, 2023, 12:04 PM IST

సంక్రాంతి  సందర్భంగా జనం  తమ స్వగ్రామాలకు  క్యూ కట్టారు. దీంతో  రైల్వేస్టేషన్లు , బస్ స్టేషన్లలో  పెద్ద ఎత్తున  రద్దీ నెలకొంది. 


హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా  స్వగ్రామాలకు  జనం వెళ్లేందుకు   బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో  రద్దీ పెరిగింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులు  సంక్రాంతి పర్వదినాన్ని  పెద్ద ఎత్తున  జరుపుకుంటారు.  దీంతో తెలంగాణలోని హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న  ఏపీకి చెందిన వాసులు సంక్రాంతి సందర్భంగా  తమ గ్రామాలకు వెళ్లేందుకు  బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు  చేరుకుంటున్నారు.  సంక్రాంతి సందర్భంగా  రైల్వే, ఆర్టీ సీ అధికారులు   సంక్రాంతి  సందర్భంగా ప్రత్యేక  సర్వీసులను  ఏర్పాటు  చేశారు.  గత ఏడాది  సంక్రాంతి  సందర్భంగా  హైద్రాబాద్ నుండి సుమారు  30 నుండి 40 లక్షల మంది ప్రయాణీకులు  ఇతర  ప్రాంతాలకు వెళ్లినట్టుగా  అంచనా.

ఈ ఏడాది  మాత్రం గత ఏడాది కంటే  ఎక్కు మంది  తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు  అంచనా వేస్తున్నారు.  ప్రయాణీకుల  రద్దీకి తగ్టట్టుగా ఏర్పాట్లు  చేస్తున్నామని అధికారులు  చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ తో పాటు  తెలంగాణ రాష్ట్రంలోని  ప్రజలు కూడా  తమ స్వగ్రామాలకు  వెళ్లేందుకు  బస్ స్టేషన్లకు బారులు తీరారు. బస్సులు, రైళ్లు  ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి.  మరో వైపు  తమ గ్రామాలకు వెళ్లేందుకు  గాను  ప్రయాణీకులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  ప్రయాణీకుల  అవసరాలను దృష్టిలో ఉంచుకొని  ప్రైవేట్  బస్సుల యజమానులు చార్జీలను భారీ ఎత్తున పెంచారు.  ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల దోపీడీపై  ప్రయాణీకులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

also read:సంక్రాంతికి స్వగ్రామాలకు జనం: పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

పండుగకు  తమ స్వంత ఊళ్లకు వెళ్తున్నందున  హైద్రాబాద్-విజయవాడ  జాతీయ రహదారిపై  వాహనాల రద్దీ పెరిగింది.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి  టోల్ ప్లాజా  వద్ద  వాహనాలు రోడ్లపై నిలిచాయి.  టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్  ఉన్నా కూడ రోడ్డుపై అరకిలోమీటర్ మేర  వాహనాలు నిలిచిపోయాయి.   రోడ్లపై  నిలిచిన వాహనాలను  టోల్ ప్లాజా సిబ్బంది  పంపేందుకు  ప్రయత్నాలు  చేస్తున్నారు.  నల్గొండ జిల్లాలోని  కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద  ఉన్న టోల్ ప్లాజా వద్ద  కూడా వాహనాల రద్దీ పెరిగింది. కోదాడకు  సమీపంలో టోల్ ప్లాజా వద్ద కూడా  వాహనాల రద్దీ నెలకొంది. 

click me!