ప్రేమించకపోతే మీ నాన్న, అన్నలను చంపేస్తా.. ప్రేమోన్మాది బెదిరింపులకు విద్యార్థిని ఆత్మహత్య...

Published : Jan 13, 2023, 10:24 AM IST
ప్రేమించకపోతే మీ నాన్న, అన్నలను చంపేస్తా.. ప్రేమోన్మాది బెదిరింపులకు విద్యార్థిని ఆత్మహత్య...

సారాంశం

ప్రేమించాలంటూ ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లిలో చోటు చేసుకుంది. 

భూదాన్ పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులను తట్టుకోలేక ఓ ఓ బాలిక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల కావ్య (16) పదో తరగతి చదువుతోంది. చౌటుప్పల్ లోని ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థిని. కావ్యను ఓ యువకుడు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. 

సోషల్ మీడియాలో ఇన్ స్ట్రాగ్రాంలో అదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి అనే అతను వేధించడం మొదలు పెట్టాడు. తనను ప్రేమించాలని మెసేజ్ లు పెట్టేవాడు. వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి ఆమె వ్యతిరేకిస్తూ.. తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో ఆ యువకుడు ఆమెను ప్రేమించకపోతే మీ నాన్న, అన్నను చంపేస్తానని, డబ్బులు కూడా కావాలని బెదిరించడం మొదలుపెట్టాడు. 

అతని వేధింపులు భరించలేక ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని తన సోదరుడైన నరేష్ కు చెప్పింది. నరేశ్ కూడా అతడిని కోప్పడ్డాడు. తన చెల్లెలికి మళ్లీ మెసేజ్ పెడితే.. తీవ్ర పరిణామాలుంటాయని శివమణిని హెచ్చరించాడు. డిసెంబర్ 31న అర్థరాత్రి ఇదే విషయంలోనరేశ్, శివమణి మధ్య గొడవ జరిగింది. శివమణి ఆ రోజు రాత్రి కావ్యకు కాల్ చేశాడు. మీ అన్నను చంపేస్తానని బెదిరించాడు. ఆమె  మనస్తాపం చెందింది. భయపడింది. దీంతో పురుగులమందు తాగింది. 

నందకుమార్ కు బెయిల్ మంజూరు: చంచల్ గూడ జైలు నుండి విడుదల

ఇది గమనించిన కుటుంబసభ్యులు గమనించి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించడంతో కోలుకుంది. ఈ నెల 2న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. దీంతో ఈ నెల 2న గ్రామంలో రెండు కుటుంబాల పెద్దమనుషులతో పంచాయతీ పెట్టారు. శివమణిని అతని తల్లిదండ్రులు కావ్య, ఆమె కుటుంబం జోలికి పోకుండా చూసుకోవాలని తెలిపారు. అయినా శివమణి మారలేదు. 

ఈ మెసేజ్ లతో కావ్య తీవ్రంగా భయపడింది. ఇక శివమణి మారడని.. తనకు వేధింపులు తప్పవని నిర్ణయానికి వచ్చింది. దీంతో బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెల్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుంది. సాయంత్రం నరేశ్ ఇంటికి వచ్చి చూసేసరికి.. కావ్య ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. 

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం సాయంత్రం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించగా, వారు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని.. ముందు జాగ్రత్తగా పోలీసులు బారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

విద్యార్థిని మృతిపై ఆమె తండ్రి కనకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. అయితే, కావ్య మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లితో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu