హైదరాబాద్ కు రానున్న చెగువేరా కూతురు డాక్టర్‌ అలైద గువేరా.. ఎప్పుడంటే ?

By team teluguFirst Published Jan 13, 2023, 11:25 AM IST
Highlights

ఈ నెల 22వ తేదీన చెగువేరా కూతురు డాక్టర్ అలైద గువేరా హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం రవీంద్ర భారతీలో నిర్వహించే ఓ కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. అందులో ఆమెకు సన్మానం చేసేందుకు సంఘీభావ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. 

చెగువేరా కూతురు డాక్టర్ అలైద గువేరా హైదరాబాద్ కు రానున్నారు. కొన్ని రోజుల కిందట ఆమె దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి వైద్య సేవల కోసం కేరళకు వెళ్లారు. అయితే ఆమె అక్కడి నుంచి బయలుదేరి పలు రాష్ట్రాలను సందర్శించనున్నారు. తరువాత ఈ నెల 22వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చేరుకుంటారు.

వ్యాపారుల కోస‌మే 'గంగా విలాస్'.. మతపరమైన ప్రదేశాలతో డబ్బు సంపాదించాలకుంటున్న బీజేపీ: అఖిలేష్ యాద‌వ్

ఆమెకు అన్ని పార్టీల నాయకులు ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించారు. 22వ తేదీన ఉదయం ఆమె హైదరాబాద్ కు చేరుకున్న తరువాత సాయంత్రం సమయంలో రవీంద్ర భారతీలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి, ప్రభుత్వ మాజీ సీఎస్ మాధవరావు, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారు. వీరంతా వేధికపై ప్రసంగించే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ కి గ్లోబల్ గ్లోబ్స్ అవార్డు.... అమూల్ స్పెషల్ డూడుల్..!

అయితే డాక్టర్‌ అలైద గువేరాకు ఘనంగా వెల్ కమ్ చెప్పాలని బీజేపీ, ఎంఐఎంయేతర సంఘీభావ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మాయత్‌నగర్‌లో ఉన్న మఖ్దూంభవన్‌లో ఆ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌ నాయకుడు మల్లు రవి, అలాగే ఆ కమిటీ సభ్యులు డీజీ నర్సింహారావు, బాలమల్లేశ్‌, టీడీపీ నాయకుడు శ్రీపతి సతీష్‌, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దిడ్డి సుధాకర్‌ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్‌ అలైద గువేరా రాక, సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఓ కరపత్రాన్ని విడుదల చేశారు. 

click me!