చెరువు శుభ్రం చేసేందుకు వెళ్లి నీట మునిగి పారిశుద్ధ్య కార్మికులు మృతి.. సిద్ధిపేటలో విషాదం..

By Asianet News  |  First Published Oct 15, 2023, 12:23 PM IST

చెరువులో మునిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. బతుకమ్మ నిమజ్జనం కోసం చెరువును శుభ్రం చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు.


బతుకమ్మ పండగ మొదటి రోజు సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువును శుభ్రం చేసేందుకు వెళ్లి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు నీట మునిగి మరణించారు. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... లారీ దూసుకెళ్లడంతో ఓ బాలుడు, ముగ్గురు యువకుల మృతి..

Latest Videos

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పటేల్ చెరువు ఉంది. బతుకమ్మ పండగ మొదటి రోజు కావడంతో ఆ గ్రామ మహిళలు అందులోనే నిమజ్జనం చేయాల్సి ఉంది. అయితే ఆ చెరువు మొత్తం గుర్రపు డెక్కలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండటంతో దానిని శుభ్రం చేయాలని ఆ గ్రామ పారిశుద్ధ్య కార్మికులు భా. దీని కోసం ఆరుగురు కార్మికులు శనివారం మధ్యాహ్నం చెరువు దగ్గరకు చేరుకున్నారు.

దారుణం.. కూతురును తరచూ కొడుతోందని.. ఏడేళ్ల మేనకోడలి హత్య..

వారంతా కలిసి చెరువును శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో 40 ఏళ్ల గిరిపల్లి భారతి నీటి గుంటల్లో కూరుకుపోయింది. అందులో నుంచి ఆమె బయటకు రాలేకపోయింది. దీనిని 43 ఏళ్ల ఎల్లం యాదమ్మ గమనించారు. వెంటనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. చెయిని పట్టుకొని లాగే సమయంలో ఆమె కూడా నీటిలోకి వెళ్లిపోయింది.

సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది మృతి, 23 మందికి గాయాలు

వీరిద్దరినీ కాపాడేందుకు అక్కడున్న 25 ఏళ్ల బాబు ప్రయత్నించాడు. అతడు కూడా పిచ్చి మొక్కల మధ్యన నీటిలో కూరుకుపోయాడు. అయితే మెట్లపై ఉన్న మరో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. వారు ముగ్గురు చూస్తుండగానే భారతి, యాదమ్మ, బాబు నీటిలో మునిగిపోయాడు. ఈ విషయం గ్రామస్తులకు, పోలీసులకు తెలిసింది. దీంతో వారంతా కలిసి డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనపై మంత్రి హరశ్ రావు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. 
 

click me!