కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా: ఐదుగురు మహిళలకు చోటు

By narsimha lode  |  First Published Oct 15, 2023, 12:06 PM IST

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో  ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. ఇందులో ఒక్కరు సిట్టింగ్ ఎమ్మెల్యే. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన  తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు కాంగ్రెస్ పార్టీ  చోటు కల్పించింది. గత ఎన్నికల్లో ములుగు నుండి విజయం సాధించిన  సీతక్క అలియాస్ ధనసరి అనసూయకు కాంగ్రెస్ పార్టీ  మరోసారి టిక్కెట్టును కేటాయించింది.కోదాడ అసెంబ్లీ స్థానం నుండి  నల్లమాద  పద్మావతి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది. గత ఎన్నికల్లో కూడ  ఆమె ఇదే స్థానం నుండి పోటీ చేశారు.

 కానీ, స్వల్ప ఓట్లతో పద్మావతి ఓటమి పాలయ్యారు.2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి  పద్మావతి విజయం సాధించిన విషయం తెలిసిందే.సనత్ నగర్ నుండి కోట నీలిమకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.గోషామహల్ నుండి సునీతకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.  సునీత  ఖైరతాబాద్ అసెంబ్లీ టిక్కెట్టు కోరుకున్నారు. కానీ, ఆమెకు  గోషామహల్ అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించారు.  ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానంలో కూడ పోటీ తీవ్రంగా ఉంది.  దీంతో సునీతకు  గోషామహల్ టిక్కెట్టు కేటాయించారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

Latest Videos

undefined

also read:కాంగ్రెస్‌తో లెఫ్ట్ సీట్ల సర్ధుబాటుపై నేడు స్పష్టత: ఆ తర్వాతే రెండో జాబితా

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ  55 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.  లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్ధుబాటు పూర్తయ్యాక  మిగిలిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.  ఇవాళ  58 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించనున్నట్టుగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే  మూడు పేర్లను తొలగించి  55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ  టిక్కెట్ల కేటాయింపు  చోటు చేసుకుంది.

click me!