Coronavirus: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా బారినపడుతున్న వారు అధికం అవుతున్నారు. చర్యలకు ఉపక్రమించిన సర్కారు.. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలతో పంచుకుంటున్న సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది.
Coronavirus: భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కొత్త కేసులు కొత్త రికార్డులను నమోదుకచేస్తున్నాయి. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెగులుచూస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. ఒమిక్రాన్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత Coronavirus ప్రభావం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే Covid-19 కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యలో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే Coronavirus కేసులు అధికంగా నమోవతుండటంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కర్నాటక-తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హస్సెల్లి గ్రామంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే, జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో కూడా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సరిహద్దు దాటుతున్న వ్యక్తులకుCoronavirus టెస్టులు నిర్వహించేందుకు చెక్‌పోస్టును ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పాటు పోలీసులు అందుబాటులో ఉండనున్నారు. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న గణేష్‌పూర్ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికిCovid-19 పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. పోలీసులతో పాటు వైద్య సిబ్బంది బృందం అయా చెక్ పోస్టుల వద్ద 24 గంటలు అందుబాటులో ఉంటారని సమాచారం.
undefined
ఈ చెక్ పోస్టులలో ప్రయాణికులందురికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వడం లేదు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వస్తేనే రాష్ట్రంలోకి వారిని అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో Corona నెగటివ్ వచ్చిన వారు మాస్కులు ధరించడం, ఇతర మార్గదర్శకాలను పాటించడం వంటి వాటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.సంగారెడ్డి జిల్లా అధికారులు మీర్జాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్నవారికి స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ Coronavirus ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.
ఇదిలావుండగా, తెలంగాణలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ వల్ల (corona deaths in telangana) మరణించిన వారి సంఖ్య 4,041కి చేరింది. ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి. ఇక భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,59,377 మందికి Coronavirus సోకింది. Covid-19 సేకండ్ వేవ్ సమయంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర Covid-19 నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ.. 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తంCoronavirus మరణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 5,90,611గా ఉన్నాయి.