
హైదరాబాద్: Vijayawada లో ఆత్మహత్యకు పాల్పడిన పప్పుల Suresh కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు పప్పుల సురేష్ ఉమ్మడి Nizambad జిల్లాకు చెందిన పప్పుల సురేష్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు చేసుకొంది. సురేష్ కుటుంబం ప్రైవేట్ ఫైనాన్షియర్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
విజయవాడలో దుర్గ అమ్బవారిని దర్శించుకొనేందుకు వచ్చిన పప్పుల సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.ఆత్మహత్యకు పాల్పడే ముందు సురేష్ సెల్ఫీ వీడియోను రికార్డు చేసకొన్నాడు. ఈ Selfie ను బంధువులకు పంపారు. అంతేకాదు సూసైడ్ నోట్ ను రాశాడు. సురేష్ బంధువుల నుండి స్వాధీనం చేసకొన్న సెల్ఫీ వీడియోను , Suicide లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
సురేష్ ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి అప్పులు తీసుకొన్నాడు.ఈ అప్పులు తీర్చలేదు. దీంతో ఫైనాన్షియర్ల నుండి వేధింపులు ఎక్కువయ్యాయి.ఈ వేధింపులు భరించలేక సురేష్ తన కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసకొన్నాడు.
ఆత్మహత్య చేసుకొనే ముందు తనను వేధింపులకు గురి చేసిన ప్రైవేట్ ఫైనాన్షియర్ల పేర్లను సెల్ఫీ వీడియోలో సురేష్ పేర్కొన్నారని సమాచారం. సూసైడ్ లేఖలో కూడా తనను వేధింపులకు గురి చేసిన ఫైనాన్షియర్ల పేర్లను కూడా సురేష్ ప్రస్తావించారని తెలిసింది.ఈ లేఖతో పాటు సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి పేర్లను సురేష్ ప్రస్తావించారు. ఈ నలుగురిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.
సురేష్ కుటుంబానికి ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఎంత మేరకు డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బులను సురేష్ తిరిగి ఇచ్చాడు, ఇంకా ఎంత రావాల్సి ఉందనే విషయాలపై కూడా ఆరా తీయనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సురేష్ ఎప్పుడు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారనే విషయమై కూడా పోలీసులు విచారించనున్నారు.ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఎంత ఒత్తిడి చేసి ఉంటే సురేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్, అతని భార్య పప్పుల శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ కలిసి ఈ నెల 6వ తేదీన దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వెళ్లారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్ తీసుకున్నారు. అయితే సురేష్ కొడుకు అఖిల్ పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాడు. అయితే ఇందుకోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడం ఆలస్యం కావడంతో వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.
సురేష్ కుటుంబం విజయవాడకు వెళ్లిన తర్వాత రోజుప్రైవేట్ పైనాన్సర్ వారు ఉంటున్న ఇంటికి చేరుకుని ఇళ్లు తమకు చెందినదని గోడలపై రాసి వెళ్లారు. అంతేకాకుండా ఈ విషయం గురించి వారు చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియజేశారు. సీజ్ చేస్తామనే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు.
విజయవాడలో ఉన్న సురేష్ కుటుంబం ఆత్మహత్యకు యత్నించినట్టుగా సమాచారం. ఈ విషయంపై అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు, బంధువులకు శ్రీలత, సురేష్‌లు సమాచారం అందజేశారు