ఖమ్మం జైలుకు కాకుండా భద్రాచలం జైలుకు వనమా రాఘవ... కారణమేంటి?

Arun Kumar P   | Asianet News
Published : Jan 09, 2022, 10:42 AM ISTUpdated : Jan 09, 2022, 11:07 AM IST
ఖమ్మం జైలుకు కాకుండా భద్రాచలం జైలుకు వనమా రాఘవ... కారణమేంటి?

సారాంశం

పాల్వంచ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే తనయకుడు వనమా రాఘవను పోలీసులు భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. 

ఖమ్మం: తన తండ్రి అధికార పార్టీ ఎమ్మెల్యేగా వున్నాడన్న అధికార మదంతో రెచ్చిపోయిన వనమా రాఘవేంద్రరావు (vanama araghava) అలియాస్ రాఘవ పాపం పండి కటకటాలపాలయ్యాడు. కామంతో కల్లుమూసుకుపోయి కట్టుకున్న భార్యను తనవద్దకు పంపించాలని రాఘవ కోరడంతో తీవ్ర మనోవేదనక గురయిన పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య (naga ramakrishna family suicide) చేసుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో స్పందించిన పోలీసులు రాఘవను అరెస్ట్ చేసారు.

శనివారం రాత్రి రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. జైలు అధికారులు బ్యారక్ నెంబర్ 1 లో రాఘవను వుంచి ఖైదీ నెంబర్ 985 కేటాయించారు.  

వనమా రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సి వుండగా వివిధ కారణాలతో భద్రాచలం సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతడిని ఖమ్మం జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే భద్రాచలం సబ్ జైలుకు తరలించడానికి గల కారణాలను మాాత్రం పోలీసులు వెల్లడించడంలేదు. 

అయితే ఈ కుటుంబ ఆస్తి పంపకాల పంచాయితీకి పెద్దగా వ్యవహరించిన వనమా రాఘవకు నీచానికి ఒడిగట్టాడు. తన పెద్దరికాన్ని నిలుపుకోకుండా అతి నీచమైన కోరికను నెరవేర్చాలని రామకృష్ణను కోరాడు. నీ భార్యను నా వద్దకు పంపిస్తే న్యాయం జరిగేలా చూస్తానని రామకృష్ణను బెదిరించాడు రాఘవ. కట్టుకున్న భార్యను పంపిచమని తననే కోరడంతో తీవ్ర  మనస్థాపానికి గురయిన రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 

మొదట తన ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుపుతూ ఓ సెల్పీ వీడియో, సూసైడ్ లెటర్ రాసిపెట్టి రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.మొదట భార్య, ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ తర్వాత రామక‌ృష్ణ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఓ రాఘవ నీచమైన కోరిక ఓ కుటుంబంమొత్తాన్ని బలిచేసింది. 

తన కుటుంబ ఆత్మహత్యకు కారణాలను తెలుపుతూ రామకృష్ణ తీసుకున్న సెల్పీ వీడియో వైరల్ గా మారడంతో రాఘవపై కేసు నమోదయ్యింది. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భార్య, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన మండిగ నాగరామకృష్ణ (40)ను ఏ1గా చూపారు. ఏ2గా వనమా రాఘవేంద్రరావు, ఏ3గా రామకృష్ణ తల్లి సూర్యవతి, ఏ4గా అక్క మాధవి, తర్వాతి నిందితులుగా రాఘవకు సహకరించిన అనుచరులు ముక్తిని గిరీష్, దావా శ్రీని వాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలను చేర్చారు.

ఇప్పటివరకు రాఘవేంద్ర 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.  రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుల సమాచారం సేకరిస్తున్నామని.. విచారణలో ఉందని వివరాలను వెల్లడించలేమని పోలీసులు చెప్పారు. రాఘవేంద్రకు సహకరించిన నిందితులకు నోటీసులు ఇచ్చామని.. వారు స్పందించకపోతే చట్టప్రకారం చర్యలు చేపడతామని  ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu