లాక్‌డౌన్‌ను మరో మూడు నెలల పాటు పొడిగించాలని కోరారు టీకాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తతో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ రోజులు లాక్‌డౌన్‌ను అమలు చేయడం దూరదృష్టితో కూడుకున్న నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు
లాక్‌డౌన్‌ను మరో మూడు నెలల పాటు పొడిగించాలని కోరారు టీకాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తతో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ రోజులు లాక్‌డౌన్‌ను అమలు చేయడం దూరదృష్టితో కూడుకున్న నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ముందుజాగ్రత్తతో విధించిన లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు.
undefined
Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
దీనిని మరింత కాలం పొడిగించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించవచ్చని జగ్గారెడ్డి అంటున్నారు. పరిస్ధితి మెరుగుపడుతున్న దశలో ఒక్కసారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే పరిస్ధితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులను జగ్గారెడ్డి అభినందించారు. విపత్కర సమయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ 19 నుంచి ప్రజలను కాపాడేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీసులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ప్రభుత్వం తగిన సౌకర్యాలను కల్పించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Also Read:రంజాన్ పేరిట మార్కెట్లలో తిరుగుతున్నారు.. మండిపడ్డ రాజాసింగ్
లాక్‌డౌన్ కారణంగా ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపథ్యంలో, ఆర్ధికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్ధిక పరిస్దితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయాలని జగ్గారెడ్డి కోరారు.