వారితో కలిసి భోజనం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

By Siva KodatiFirst Published Apr 27, 2020, 4:43 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోటలో పేదలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోటలో పేదలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్నిసాధించిన పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా సంబరాలు చేసుకోవాలని కానీ కరోనా కారణంగా వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నందున, ఈ మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు ఎవరి ఇంటి వద్ద వారు జెండా ఎగురేసి ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని కేసీఆర్ సూచించారని సత్యవతి అన్నారు.

లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండొద్దన్న సిఎం కేసిఆర్ పిలుపు మేరకు మానుకోటలో  సుమారు 500 మందికి సత్యవతి రాథోడ్ భోజనం ఏర్పాట్లు చేశారు.

Also Read:తెలంగాణలో కొత్తగా 11 మందికి పాజిటివ్, 1000కి చేరిన కేసులు: హైదరాబాద్‌లోనే అత్యధికం

వారికి స్వయంగా వడ్డించడంతో పాటు అనంతరం మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్, దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. 
 

click me!