సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడి రాజీనామా.... టీఆర్ఎస్‌లో చేరిక

By Arun Kumar PFirst Published Nov 2, 2018, 2:53 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడమే తడువుగా అసమ్మతి సెగ మొదలవుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులవుతున్నా ఆ పార్టీలో అసమ్మతి స్వరం ఇంకా వినిపిస్తోంది. ఇక ఇటీవలే బిజెపి పార్టీ కూడా రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఓ వైపు పార్టీ తరపున సీటు పొందిన నేతలు ప్రచారానికి సిద్దమవుతుండగా....అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డ నేతలు మాత్ర పార్టీని వీడుతున్నారు. ఇలా ఇప్పటికే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పార్టీని వీడగా తాజాగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కూడా అదేబాటలో నడిచారు. 
 
గురువారం పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాసాల ముచ్చిరెడ్డి ఇవాళ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

బిజెపి నాయకులు చేరిక కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ బిజెపి అధినాయకత్వంపై విరుచుకుపడ్డారు. బిజెపి అధ్యయక్షుడు అమిత్ షా, పరిపూర్ణానంద తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ వచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఎందుకు ఖాళీ అవుతోందో వారే చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ లో బిజెపి వచ్చేది లేదు సచ్చేది లేదని హరీష్ స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగారెడ్డి కాసాల బుచ్చిరెడ్డి కి సముచిత స్థానం కల్పిస్తామని హరీష్  హామీ ఇచ్చారు. వీరి చేరికతో సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ మరింత  బలోపేతమైందన్నారు.  పార్టీలో చేరిన నాయకులను బాగా చూసుకుంటామని హరీష్ హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు

బిజెపికి షాక్... రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షుడు

బిజెపికి షాక్.... టీఆర్ఎస్‌‌లో చేరిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ బిజెపికి తాకిన అసమ్మతి సెగ...జిల్లా అధ్యక్షుడి రాజీనామా

click me!