నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Published : Nov 02, 2018, 02:42 PM IST
నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

కేసీఆర్‌ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తేనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

తనను చంపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి నల్లగొండ పట్టణంలోని 13వ వార్డు పరిధిలో గల పెద్దబండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తేనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలతో మన బతుకులు మనమే మార్చుకోవాలని ప్రజలకు సూచించారు.

కేసీఆర్ తనను  చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముందు తన అనుచరులను హత్య చేసి.. అనంతరం తనను చంపాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?