రెండో రోజూ కూడ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సిర్పూర్కర్ కమిషన్ ముందు హాజరయ్యారు. సోమవారం నాడు కూడ ఆయనను కమిషన్ సభ్యులు విచారించారు. ఇవాళ కూడ ఆయనను విచారించారు.ఎన్‌కౌంటర్ గురించి సజ్జనార్ ను సభ్యులు ప్రశ్నించారు.
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కు సంబంధించి రెండో రోజూ vs sirpurkar commission ముందు ఐపీఎస్ అధికారి sajjanar హాజరయ్యారు.సోమవారం నాడు రెండు గంటల పాటు సజ్జనార్ ను కమిషన్ విచారించింది. ఇవాళ కూడ కమిషన్ ముందు సజ్జనార్ హాజరయ్యారు.
also read:దిశ నిందితుల అరెస్ట్‌పై ముందే ఎలా చెప్పారు?: సజ్జనార్‌ను ప్రశ్నించిన కమిషన్
undefined
disha నిందితుల ఎన్ కౌంటర్ గురించి సజ్జనార్ ను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ జరిగిన రోజున ఉదయం ఈ సమాచారాన్ని shamshabad డీసీపీ prakash reddyతనకు ఇచ్చారన్నారు. దీంతో తాను చటాన్ పల్లికి చేరుకొన్నానని సజ్జనార్ తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రదేశానికి చేరుకొన్న తర్వాత ఏసీపీ surenderను కలిసినట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత డీఎంఈకి పోస్టుమార్టం కోసం సమాచారం ఇచ్చినట్టుగా సజ్జనార్ కమిషన్ సభ్యులకు చెప్పారు.
cyberabad పోలీస్ కమిషనరేట్‌కి న్యాయ సలహదారుగా ఉన్న అడ్వకేట్ బుచ్చయ్య సలహా మేరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించినట్టుగా సజ్జనార్ కమిషన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వరంగల్ లో ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్ తో పాటు నక్సల్స్ ఎన్ కౌంటర్, దిశ నిందితుల ఎన్ కౌంటర్లు ఒకే తరహాలో ఉన్నాయని కమిషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే వరంగల్ లో ఎన్ కౌంటర్ సమయంలో తాను ఎస్పీగా ఉన్నానని సజ్జనార్ గుర్తు చేసుకొన్నారు. 2016 నుండి చాలా కాలం పాటు తాను ఎస్ఐబీలో పనిచేసినట్టుగా సజ్జనార్ తెలిపారు.
2019 డిసెంబర్ 6వ తేదీన ఉదయం చటాన్‌పల్లి వద్ద దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని నిందితులు కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ఎన్‌కౌంటర్ పై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఈ కమిషన్ విచారణ ఆలస్యమైంది.