హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్-బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యత భుజానికెత్తుకున్న మంత్రి హరీష్ రావుపై బిజెపి ఎమ్మెల్యే రఘునందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రత్యర్థి పార్టీ బిజెపి అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గెలవాలని హరీష్ రావు కోరుకుంటున్నారని... పైకి మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోసం పనిచేస్తున్నారని అన్నారు. సమాచారం లేకుండా తాను ఇలా మాట్లాడటం లేదని... పోలీసులే తనతో మంత్రి మనసులోని మాటను చెప్పారని BJP MLA రఘునందన్ పేర్కొన్నారు.
raghhunandan rao మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతిరెడ్డిపేట్ లో బిజెపి అభ్యర్థి eatala rajender కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి harish rao తో పాటు TRS పార్టీపై విరుచుకుపడ్డారు. మొన్న తనను, నిన్న రాజేందర్ ను టీఆర్ఎస్ లోంచి వెల్లగొట్టినట్లే రేపు హరీష్ రావును కూడా కేసీఆర్ వెల్లగొడతారని రఘునందన్ అన్నారు.
undefined
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 102 కాస్తా 103 అవుతుంది... కానీ ఈటల గెలిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరో ఎమ్మెల్యే ప్రజలకు దొరుకుతారని తెలిపారు. ఈటల రాజీనామాతోనే హుజురాబాద్ లో అభివృద్ది జరుగుతోందని... ఇక్కడి ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయన్నారు రఘునందన్.
READ MORE Huzurbad Bypoll: ఈటల జమునకు బ్రహ్మరథం... బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో హరీష్ రావు తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నవారిని పార్టీలోంచి బయటకు పంపుతూ నై తెలంగాణ అన్న గంగుల కమలాకర్ లాంటివారికి మంత్రిపదవులు కట్టబెడుతున్నారని రఘునందర్ రావు ఆరోపించారు.
ఇక హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పేరునే పోలిన మరో ముగ్గురు నామినేషన్లు వేసారు. అయితే నామినేషన్ల పరిశీలనలో భాగంగా ఇవాళ ఈ ఈ ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇది బిజెపికి, ఈటల రాజేందర్ కు కలిసివచ్చే నిర్ణయమే.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి రిపబ్లిక్ పార్టీ తరపున ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ తరపున ఈసంపల్లి రాజేందర్, ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ వీరితో నామినేషన్లు వేయించిందన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ముగ్గురు ఉపఎన్నిక బరినుండి తప్పుకోవడంతో ఈటల తో బిజెపి నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్టోబర్ 1వ తేదీన హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ (election notification) విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా నిన్న అంటే అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించారు. ఇక అక్టోబర్ 13వరకు అంటే రేపటివరకు నామినేషన్ల ఉపసంహరణకు గుడువు వుండగా... అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న కౌంటింగ్ (counting)నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.