ఏదో చేయబోతున్నట్లు హైప్.. తర్వాత అటకపైకి: కేసీఆర్ సర్కార్‌పై విజయశాంతి సెటైర్లు

Siva Kodati |  
Published : Oct 12, 2021, 04:51 PM ISTUpdated : Oct 12, 2021, 04:52 PM IST
ఏదో చేయబోతున్నట్లు హైప్.. తర్వాత అటకపైకి: కేసీఆర్ సర్కార్‌పై విజయశాంతి సెటైర్లు

సారాంశం

తెలంగాణ ప్రభుత్వంపై (telangan govt) బీజేపీ (bjP) నేత విజయశాంతి (vijayasanthi) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ (bc policy) ఇప్పుడు ఏమైందని ఆమె ప్రశ్నించారు. 

తెలంగాణ ప్రభుత్వంపై (telangan govt) బీజేపీ (bjP) నేత విజయశాంతి (vijayasanthi) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ (bc policy) ఇప్పుడు ఏమైందని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ (kcr) అధ్యక్షతన అసెంబ్లీలో (telangana assembly) బీసీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశాలు మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆ సమావేశాల్లో 210 తీర్మానాలు చేసి ఆమోదించారని, ఇప్పుడవన్నీ అటకెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ పాలసీ వస్తే అన్ని రంగాల్లో ముందుకెళ్లవచ్చని భావించిన బీసీలకు నిరాశే మిగిలిందని రాములమ్మ వెల్లడించారు.

ఏదో చేయబోతున్నట్టు అప్పట్లో హైప్ సృష్టించి, 2018 ఎన్నికల్లో గెలిచాక ఆ తీర్మానాలను మూలనపడేశారని విజయశాంతి ఆరోపించారు. ఇప్పుడు కులవృత్తుల పేరిట ప్రజలను మళ్లీ పాతాళానికి నెట్టివేయడానికి టీఆర్ఎస్ (trs) ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె దుయ్యబట్టారు. ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ (huzurabad bypoll) దళిత ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Also Read:అమరుల పేరుతో ఉద్యమాలు.. మాకు హక్కు లేదంటే, కాంగ్రెస్‌కు కూడా లేనట్లే: విజయశాంతి

గతంలో దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీతో పాటు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు హామీని కూడా తుంగలో తొక్కారని విజయశాంతి మండిపడ్డారు. ఇప్పుడు దళిత సాధికారత అంటూ దళిత బంధు (dalit empowerment scheme) అనే పథకంతో దళితులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, బీసీలను రాష్ట్ర సర్కారు మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (etela rajender) ను గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడతారని విజయశాంతి స్పష్టం చేశారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్