సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: నిందితుడు రాజు ఆత్మహత్య, రైల్వే ట్రాక్ పై శవం

By narsimha lodeFirst Published Sep 16, 2021, 10:45 AM IST
Highlights

హైదరాబాద్: సైదాబాద్ మైనర్ బాలిక పై రేప్  చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ మీద రాజు శవం కనిపించింది.

హైదరాబాద్: సైదాబాద్ మైనర్ బాలిక పై రేప్  చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ విషయమై పోలీసులు అధికారంగా ప్రకటించాల్సి ఉంది. జనగామ  జిల్లా స్టేన్‌ఘన్‌పూర్ రైల్వేట్రాక్ పై ఓ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ ఉన్న చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజుగా స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహం చేయిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది.దాని ఆధారంగా పోలీసులు శవం రాజుదిగా గుర్తించారు. మరికొద్దిసేపట్లో హైద్రాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరకొనే అవకాశం ఉంది.

శవాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భార్య మౌనిక పేరును రాజు పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. రాజు భార్య తన పుట్టింట ఉంటోంది. రాజు ఫొటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. ఊహాచిత్రాలను కూడా విడుదల చేశారు. అన్ని పోలీసు స్టేషన్లకు సైదాబాద్ పోలీసులు అతని ఫొటోను, ఊహాచిత్రాలను పంపించారు. రాజారాం స్టేషన్ వద్ద పోలీసులు రాజు శవాన్ని పరిశీలిస్తున్నారు. 

రాజు కోసం దాదాపు వేయి మంది పోలీసులు గాలింపు చేపట్టారు. చిన్నారి సంఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తూ వస్తున్నారు. వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. రాజు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. 

నాలుగు వారాల క్రితం అత్తవారింటికి వెళ్లినప్పుడు అత్తపై దాడి చేశాడు. దాంతో అత్తగారింటికి చెందినవారు ఎవరైనా అతన్ని హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజుది ఆత్మహత్యనా, హత్యనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ha

వినాయకచవితి రోజునే చిప్స్ ప్యాకెట్ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై  లాఠీచార్జీ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 గంటల  ఆందోళన తర్వాత  స్థానికులు ఆందోళనను విరమించారు.

ఆ ఘటన జరిగిన రోజు నుండి  రాజకీయ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

 

click me!