RTC Strike: రెండో రోజూ కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష

By telugu teamFirst Published Nov 17, 2019, 10:35 AM IST
Highlights

ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపెట్టాలంటూ నిన్న దీక్షకు దిగిన అశ్వత్థామరెడ్డి, రెండో రోజు కూడా తన దీక్షను కొనసాగిస్తున్నాడు. బిఎన్ రెడ్డి నగర్ లోని తన ఇంటిలో తన దీక్షను కొనసాగిస్తున్నాడు.

హైదరాబాద్: ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపెట్టాలంటూ నిన్న దీక్షకు దిగిన అశ్వత్థామరెడ్డి, రెండో రోజు కూడా తన దీక్షను కొనసాగిస్తున్నాడు. బిఎన్ రెడ్డి నగర్ లోని తన ఇంటిలో తన దీక్షను కొనసాగిస్తున్నాడు. 

ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా నిన్న ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీసులో దీక్షకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిన్ననే జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

Also read: RTC Strike: మహా దీక్ష నేపథ్యంలో మందకృష్ణ హౌస్ అరెస్ట్

అశ్వత్థామరెడ్డిని కూడా అరెస్ట్‌ చేసేందుకు నిన్న ఉదయం నుండే ఆయన ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసుల యత్నించారు. దానితో పోలీసుల మధ్య కార్మికుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. 

అశ్వత్థామరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. నిన్న ఉదయం నుంచి బిఎన్ రెడ్డి నగర్ లోని ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. నిన్న రాత్రి పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలి పోవాలని యత్నించినప్పుడు, తనను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. 

Also read: నన్ను అరెస్ట్ చేస్తే అత్మహత్య చేసుకుంటా!: RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి

నేటి ఉదయం ఆయన్ను పరిశీలించిన వైద్యులు ఆయన బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గాయని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన నివాసం వద్ద పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో మోహరించారు. వైద్యులు కూడా అక్కడే అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

హైదరాబాద్: ఉమ్మడి ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ, సింగరేణి కార్మికులతో పాటు  తెలంగాణ ఎన్‌జీవోలు 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 42 రోజుల పాటు జరిగిన సమ్మె ఆర్టీసీ కార్మికులదే కావడం గమనార్హం.

also read:ఆర్టీసీ విలీనం ప్రస్తుతానికి వద్దు.. మిగిలిన డిమాండ్లు తేల్చండి: అశ్వత్థామరెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో  ఆనాడు జేఎసీ పిలుపు మేరకు సకల జనుల సమ్మె నిర్వహించారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకమైన ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సమ్మె  చేశారు. ఈ సమ్మెలో ఆర్టీసీ, తెలంగాణ ఎన్‌జీవోలు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నారు.

Also Read:కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ: రూట్ల ప్రైవేటీకరణపై స్టే

2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి ఆనాడు సకల జనుల సమ్మె ప్రారంభమైంది. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కూడ దసరా పర్వదినం వచ్చింది. 

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టికి 42వ రోజుకు చేరుకొంది.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెట్టు దిగడం లేదని  ఆర్టీసీ జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:ఆర్టీసీ సమ్మె: సెప్టెంబర్ జీతాలపై హైకోర్టు విచారణ వాయిదా

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ విషయమై ఆర్టీసీ జేఎసీ నేతలు వెనక్కు తగ్గారు. ఈ డిమాండ్ మినహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

ఆర్టీసీ కార్మికులు 42 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇంకా  కూడ సమ్మెను కొనసాగిస్తామని జేఎసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జేఎసీ నేతలు  ఈ నెల 18వ తేదీ వరకు తమ  నిరసన కార్యక్రమాన్ని ప్రకటించారు.

ఈ నెల 18వ తేదీన ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ రోజున హైకోర్టు ఏ రకమైన విచారణ చేయనుందోననే  విషయమై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ సమ్మెలోకి కార్మికులు వెళ్లినందున సెప్టెంబర్ మాసానికి చెందిన వేతనాలను ప్రభుత్వం చెల్లించలేదు. ఈ వేతనాల కోసం  కూడ ఆర్టీసీ కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఎసీ నేతలు వెనక్కు తగ్గారు. తమ డిమాండ్ పై ఆర్టీసీ జేఎసీ నేతలు వెనక్కు తగ్గడంపై  ప్రభుత్వ స్పందన కోసం ఆర్టీసీ కార్మికులు చూస్తున్నారు.

click me!