RTC Strike:ముంబై ఫార్మూలాకు జీహెచ్ఎంసీ టోకరా

By narsimha lodeFirst Published Nov 1, 2019, 6:04 PM IST
Highlights

ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు ముంబై పార్మూాలాను అమలు చేయాలని  కేసీఆర్ సర్కార్ తీసుకొన్న నిర్ణయం అమలు కావడం లేదు.జీహెచ్ఎంసీ నుండి రెండేళ్ల పాటు మాత్రమే నిధులను విడుదల చేసినట్టుగా ఆర్టీసీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. 

హైదరాబాద్: హైద్రాబాద్‌ నగరంలో ఆర్టీసీకి వస్తున్న నష్టాలను పూడ్చేందుకు ముంబై ఫార్మూలాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చింది. అయితే ఈ ముంబై ఫార్మూలా మాత్రం  ఆచరణలో అమలు కాలేదు. రెండేళ్లు మాత్రమే జీహెచ్ఎంసీ ఆర్టీసీకి నిధులు ఇచ్చినట్టుగా అధికారికంగా  ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు చెప్పింది.

Also Read:RTC Strike అధికారులున్నది ఆర్టీసీని రక్షించడానికా.. అమ్మేయడానికి: అశ్వత్థామరెడ్డి...

ఆర్టీసీ నష్టాలకు ప్రధానంగా సిటీలో నడుస్తున్న సిటీ బస్సులే కారణమని 2017లో ప్రభుత్వం అభిప్రాయపడింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు స్థానిక సంస్థల నుండి నిధులను వాడుకోవాలని కేసీఆర్ సర్కార్ ఆనాడు భావించింది.  ఈ మేరకు ముంబై ఫార్మూలాను అమలు చేయాలని  నిర్ణయం తీసుకొంది.

Also Read: ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు...

ఆర్టీసీ నష్టాలకు లాంగ్ రూట్ సర్వీసులు కాకుండా సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంతాల బస్సు రూట్లే ప్రధాన కారణమని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం అభిప్రాయపడింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో నడిపించేందుకు ఆనాడు కేసీఆర్ సర్కార్ ముంబై ఫార్మూలాను తెరమీదికి తీసుకొచ్చారు.

Also Read: RTC strike తెలంగాణ హైకోర్టు వద్ద ఉద్రిక్తత.. లాయర్‌పై తిరగబడ్డ ఆర్టీసీ కార్మికులు ...

ఆనాడు హోంశాఖ, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డితో పాటు ఆర్టీసీకి చెందిన అధికారులు  ముంబైలో పర్యటించి ప్రభుత్వానికి నివేదికను అందించారు.

హైద్రాబాద్‌  సిటీలో ప్రజల సౌకర్యార్ధం నడుపుతున్న బస్సులను నష్టాన్ని పూడ్చేందుకు ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ద్వారా ప్రతి ఏటా నిధులను ఇవ్వాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించారు.

ఈ చట్ట సవరణ ద్వారా ఆర్టీసీకి సిటీ బస్సులు నడపడం ద్వారా వచ్చే ఆదాయాన్ని జీహెచ్ఎంసీ ద్వారా పూడ్చాలని ఆ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ చట్ట సవరణ కూడ చేశారు.

Also Read టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు: కేసీఆర్ తేలుస్తారా? ...

ప్రతి ఏటా సిటీ బస్సులకు వస్తున్న నస్టాన్ని పూడ్చేందుకుగాను జీహెచ్ఎంసీ రూ.330 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకొంది. అయితే  ఈ నిర్ణయం ప్రకారంగా రెండేళ్ల పాటు జీహెచ్ఎంసీ ఆర్టీసీకి  నిధులను అందించినట్టుగా ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ శుక్రవారం నాడు  హైకోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నారు.
ఆ తర్వాత ఈ చట్ట సవరణలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని  ఆర్టీసీ నష్టాలను పూడ్చేందుకు నిధులను ఇవ్వడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.

Also Read:RTC Strike:ముంబై ఫార్మూలాకు జీహెచ్ఎంసీ టోకరా

ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎందుకు నిధులు ఇస్తోందని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిటీ బస్సుల ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకొంటే ఆర్టీసీ నష్టాలు మరింత  పెరిగేవి కావనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

అయితే డీజీల్‌పై ఉన్న వ్యాట్  బారాన్ని తగ్గిస్తే ఆర్టీసీ ఇంతగా నష్టపోదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. విమానానికి  సరఫరా చేసే ఇంధనానికి  రాయితీలు ఇస్తూ ఆర్టీసీకి సరఫరా చేసే డీజీల్‌పై మాత్రం రాయితీలు  ఇవ్వకపోవడాన్ని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
 

click me!