ఇన్‌ఛార్జ్ ఎండీని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాం..అది మా స్టామినా : అశ్వత్థామరెడ్డి

Published : Nov 01, 2019, 05:34 PM ISTUpdated : Nov 01, 2019, 05:59 PM IST
ఇన్‌ఛార్జ్ ఎండీని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాం..అది మా స్టామినా : అశ్వత్థామరెడ్డి

సారాంశం

ఆర్టీసీ యాజమాన్యం తరపున పిటిషన్ వేయకుండా మున్సిపల్ శాఖ తరపున పిటిషన్ వేసినట్లుగా ఉందనన్నారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ సమ్మెపై విచారణ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏది చెబితే అధికారులు అదే కోర్టుకు సమర్పించారని అశ్వత్థామరెడ్డి ఎద్దేవా చేశారు

ఆర్టీసీ యాజమాన్యం తరపున పిటిషన్ వేయకుండా మున్సిపల్ శాఖ తరపున పిటిషన్ వేసినట్లుగా ఉందనన్నారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ సమ్మెపై విచారణ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏది చెబితే అధికారులు అదే కోర్టుకు సమర్పించారని అశ్వత్థామరెడ్డి ఎద్దేవా చేశారు.

ఆర్టీసీ నివేదికపై న్యాయమూర్తి సైతం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు చురకలంటించారని ఆయన గుర్తుచేశారు. ఇది సిగ్గుచేటని... 25 రోజుల పాటు కార్మికులు సమ్మెలో ఉన్నారని, పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారని అయినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా కళ్లు తెరవకపోవడం దారుణమన్నారు.

ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఆర్టీసీ ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సైతం సమాధానం చెప్పలేని స్ధితిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తమకు వచ్చేశాయని ఎండీ చెబుతున్నారని.. అవి ఎలా వచ్చాయో మాత్రం కోర్టుకు చెప్పలేకపోయారని అశ్వత్థామరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ బకాయిలు రావాల్సిన మాట వాస్తవమేనని స్వయంగా రవాణా శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇన్‌ఛార్జి ఎండీని దోషిగా నిలబెట్టామని అది తమ్మ సత్తా అని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

 

Also read:ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు

అధికారుల తీరు చూస్తుంటే వీళ్లు ఆర్టీసీని రక్షించడానికి వున్నారో లేక అమ్ముకోవడానికి ఉన్నారో అర్ధంకావడం లేదని అశ్వత్థామరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

శనివారం కార్మికులు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి డిపోల ముందు ర్యాలీలు నిర్వహించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. వాస్తవ పరిస్ధితులు గమనించి.. రూ.3,000 కోట్లు ప్రభుత్వం తరపు నుంచి యాజమాన్యానికి రావాల్సి ఉందని... ఆర్టీసీ నష్టాల్లో మునిగిపోలేదని, ఉద్దేశ్యపూర్వకంగానే ముంచేస్తున్నారని అశ్వత్ధామరెడ్డి ఆరోపించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ర్టీసీ సమ్మెకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.ఆర్టీసీ సంస్థ ఆర్ధిక స్థితిగతులతో పాటు నష్టానికి గల కారణాలను ఆ అఫిడవిట్‌లో ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

Also read:RTC Strike: మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం

అయితే ఆర్టీసీ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు మండిపడింది. తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు  ముందే ఆర్టీసీకి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

సమ్మె ప్రారంభమైనా అక్టోబర్ 5 నుండి 30వ తేదీ వరకు ఆర్టీసీ సమ్మె కాలంలో రూ. 78 కోట్లను ఆర్జించినట్టుగా సునీల్ శర్మ హైకోర్టుకు వివరించారు. 2018-19 సంవత్సరానికి గాను  తెలంగాణ ప్రభుత్వం రూ. 644.51 కోట్లను ఆర్టీసీకి చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. 

ఆర్టీసీలో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉందని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది. డీజీలో భారం కూడ నష్టాలకు కారణంగా మారిందని ఈ అఫిడవిట్‌లో ఆర్టీసీ అభిప్రాయపడింది.హైద్రాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులను తిప్పినందుకు గాను రూ. 1744 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జీహెచ్ఎంసీని కోరింది.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu