# RTC strike తెలంగాణ హైకోర్టు వద్ద ఉద్రిక్తత.. లాయర్‌పై తిరగబడ్డ ఆర్టీసీ కార్మికులు

By Siva Kodati  |  First Published Nov 1, 2019, 5:54 PM IST

తెలంగాణ హైకోర్టు ముందు ఉద్రిక్తత నెలకొంది. లాయర్ పీవీ కృష్ణయ్యపై ఆర్టీసీ కార్మికులు తిరగబడ్డారు. మీడియా సమావేశంలో కార్మిక యూనియన్లకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారంటూ ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో యూనియన్ లీడర్ల మాటలు వినొద్దంటూ కృష్ణయ్య.. కార్మికులకు సూచించారు.


తెలంగాణ హైకోర్టు ముందు ఉద్రిక్తత నెలకొంది. లాయర్ పీవీ కృష్ణయ్యపై ఆర్టీసీ కార్మికులు తిరగబడ్డారు. మీడియా సమావేశంలో కార్మిక యూనియన్లకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారంటూ ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో యూనియన్ లీడర్ల మాటలు వినొద్దంటూ కృష్ణయ్య.. కార్మికులకు సూచించారు. అలాగే సమ్మె విరమించి వెంటనే ఉద్యోగాల్లో చేరాలని కోరారు. 

ఆర్టీసీ సమ్మెపై విచారణ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏది చెబితే అధికారులు అదే కోర్టుకు సమర్పించారని అశ్వత్థామరెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్టీసీ నివేదికపై న్యాయమూర్తి సైతం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు చురకలంటించారని ఆయన గుర్తుచేశారు.

Latest Videos

undefined

ఇది సిగ్గుచేటని... 25 రోజుల పాటు కార్మికులు సమ్మెలో ఉన్నారని, పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారని అయినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా కళ్లు తెరవకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.

ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఆర్టీసీ ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సైతం సమాధానం చెప్పలేని స్ధితిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తమకు వచ్చేశాయని ఎండీ చెబుతున్నారని.. అవి ఎలా వచ్చాయో మాత్రం కోర్టుకు చెప్పలేకపోయారని అశ్వత్థామరెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read:#RTC Strike అధికారులున్నది ఆర్టీసీని రక్షించడానికా.. అమ్మేయడానికి: అశ్వత్థామరెడ్డి

ప్రభుత్వం నుంచి ఆర్టీసీ బకాయిలు రావాల్సిన మాట వాస్తవమేనని స్వయంగా రవాణా శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికారుల తీరు చూస్తుంటే వీళ్లు ఆర్టీసీని రక్షించడానికి వున్నారో లేక అమ్ముకోవడానికి ఉన్నారో అర్ధంకావడం లేదని అశ్వత్థామరెడ్డి ధ్వజమెత్తారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శనివారం కార్మికులు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి డిపోల ముందు ర్యాలీలు నిర్వహించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

వాస్తవ పరిస్ధితులు గమనించి.. రూ.3,000 కోట్లు ప్రభుత్వం తరపు నుంచి యాజమాన్యానికి రావాల్సి ఉందని... ఆర్టీసీ నష్టాల్లో మునిగిపోలేదని, ఉద్దేశ్యపూర్వకంగానే ముంచేస్తున్నారని అశ్వత్ధామరెడ్డి ఆరోపించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ర్టీసీ సమ్మెకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.ఆర్టీసీ సంస్థ ఆర్ధిక స్థితిగతులతో పాటు నష్టానికి గల కారణాలను ఆ అఫిడవిట్‌లో ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

Also read:ఏం లెక్కలివి: ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మొట్టికాయలు

అయితే ఆర్టీసీ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు మండిపడింది. తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు  ముందే ఆర్టీసీకి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

click me!