బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

By Sairam Indur  |  First Published Mar 22, 2024, 2:22 PM IST

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కేటాయించింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయనను ఖరారు చేసింది.


తెలంగాణలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించారు. ఇందులో ఇటీవల బీఎస్పీకి తెలంగాణా చీఫ్ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చోటు దక్కింది.

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. ఎంత మందికి చోటు దక్కిందంటే ?

Latest Videos

ఆయనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ సూచించారు. అలాగే మరో మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట రాంరెడ్డిని కూడా బరిలోనే నిలిపారు. ఆయనకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చోటు కల్పించారు. దీంతో ఈ జాబితాలో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు చోటు దక్కినట్టు అయ్యింది. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 2021 ఆగస్టులో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అనంతరం ఆయన బీఎస్పీ తెలంగాణ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి బహుజనవాదం నినాదంతో తెలంగాణ అంతటా పర్యటించారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీపైన విమర్శలు చేశారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయింది. 

ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. బెయిల్ విషయంలో కీలక వ్యాఖ్యలు..

కాగా.. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తుతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనతోనే కలవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యిది. అయితే తరువాత ఆ పొత్తు వీగిపోయింది. దీంతో అనూహ్యంగా బీఎస్పీకి ఆర్ఎస్ పీ రాజీనామా చేశారు. 

తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆర్ఎస్పీకి మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయనకు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కేటాయించింది. మరి బీఆర్ఎస్ లో ఆర్ఎస్పీ భవితవ్యం ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరి కొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే.

click me!