ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. బెయిల్ విషయంలో కీలక వ్యాఖ్యలు..

By Sairam IndurFirst Published Mar 22, 2024, 1:33 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరుఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అలాగే ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఈ కోర్టు అనుసరిస్తున్న ప్రోటోకాల్ ను దాటవేయలేమని, ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం కవితకు సూచించింది.

ఇస్రో మరో ఘనత.. పుష్పక్ ఆర్ఎల్వీ ప్రయోగం సక్సెస్..

అలాగే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనలను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన ఇతర అంశాలను కోర్టు అంగీకరించింది. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ, ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెను ఈ నెల 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. 

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. దేశ వ్యాప్త ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు..

ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆమె నివాసంలో సోదాలు జరిపింది. మరుసటి రోజు ఆమెను ప్రత్యేక పిఎంఎల్ఎ కోర్టులో హాజరుపరచగా, మార్చి 23 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీ విధించింది. అయితే దానిని సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. ఎంత మందికి చోటు దక్కిందంటే ?

ఇదిలా ఉండగా.. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. తరువాత  సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. అయితే ఈడీ బలవంతపు చర్యల నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ కు రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే సీఎం అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. బీజేపీపై విమర్శలు చేశారు. దేశంలోని విపక్ష పార్టీలు కూడా కేజ్రీవాల్ అరెస్టును ఖండించాయి.

click me!