Patnam Sunitha Reddy Biography: పట్నం సునీతా రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారి టీడీపీ నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా పని చేసి, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తుంది. తాజాగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సిగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమె జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం..
Patnam Sunitha Reddy Biography: పట్నం సునీతా రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారి టీడీపీ నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా పని చేసి, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తుంది. తాజాగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సిగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమె జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం..
బాల్యం, విద్యాభ్యాసం
undefined
పట్నం సునీత మహేందర్ రెడ్డి 1974 నవంబర్ 25న మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకుర్ లో జన్మించారు. సునీత తల్లి పేరు రాజమణి, తండ్రి గోపాల్ రెడ్డి. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఆమె విద్యాభ్యాసం స్థానికంగా, జోగిపేటలో సాగింది. బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్న ఆమె పట్టం మహేందర్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో అడుగుపెట్టిన సునీతకు కొద్దిరోజుల తర్వాత పాలిటిక్స్ గురించి అవగాహన వచ్చింది. అలా భర్త ప్రోత్సాహంతో ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చింది.
రాజకీయ జీవితం
పట్నం సునీతా రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారి 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బంట్వారం జడ్పీటీసిగా ఎన్నికై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె ఆ తరువాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి 2014లో యాలాల జడ్పీటీసిగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కొట్‌పల్లి జడ్పీటీసిగా ఎన్నికై నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా తొలి ప్రజా పరిషత్ (జడ్పీ) చైర్‌పర్సన్‌గా 2019 జూన్ 8న ఎన్నికయ్యారు.
2024లో మర్పల్లి మండలం పట్లూరులో స్వంత పార్టీ నాయకులే తన వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించిన ఘటనపై ఆమె అధిష్ఠానంకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అప్పటి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితరులను హైదరాబాద్‌కు పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటూ 2023లో జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేయలేదని టాక్.
ఈ తరుణంలో తన భర్త పట్నం మహేందర్ తో పాటు 2024 ఫిబ్రవరి 16న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ సిగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ టికెట్ లభించడంతో తన భార్య సునీతను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఇప్పటివరకు స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.
వ్యక్తిగత వివరాలు
జననం: 1974 నవంబరు 25 (వయసు 49)
జన్మస్థలం: దాకూర్, ఆందోల్ మండలం, తెలంగాణ
రాజకీయ పార్టీ: కాంగ్రెస్
తల్లిదండ్రులు: రాజమణి, గోపాల్ రెడ్డి
జీవిత భాగస్వామి: పి.మహేందర్ రెడ్డి
బంధువులు: పట్నం నరేందర్ రెడ్డి (మరిది)
సంతానం: పట్నం రినీష్ రెడ్డి (కుమారుడు), మనీషా రెడ్డి (కుమారై)
నివాసం: బంజారాహిల్స్. హైదరాబాద్