ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం, రన్నింగ్ లో ఉన్న లారీని ఢీకొట్టిన కారు... ఒకరు మృతి...

Published : Dec 21, 2021, 08:35 AM IST
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం, రన్నింగ్ లో ఉన్న లారీని ఢీకొట్టిన కారు... ఒకరు మృతి...

సారాంశం

ప్రమాదం జరిగిన సమయంలో లారీ, కారు రెండూ రన్నింగ్ లోనే ఉన్నాయి. ముందు నడుస్తున్న లారీని వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో పాస్టర్ డేనియల్ కారు అద్దాలు పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించిన భార్య, డేనియల్‌ భార్య పరిస్థితి విషమంగా ఉంది.

రంగారెడ్డి : రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర Road accidentపై జరిగింది. వేగంగా వచ్చి ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జంటలో husband అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన భార్యను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మరణించిన వ్యక్తిని పాస్టర్ డేనియల్‌గా గుర్తించారు. భార్యతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డుపై సంగారెడ్డి నుంచి ఎల్బీనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో లారీ, కారు రెండూ రన్నింగ్ లోనే ఉన్నాయి. ముందు నడుస్తున్న లారీని వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో పాస్టర్ డేనియల్ కారు అద్దాలు పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించిన భార్య, డేనియల్‌ భార్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే, పాస్టర్ డేనియల్ నిద్ర మత్తులో వాహనం నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, బడి కోసం బయల్దేరిన ఆ ముగ్గురు అన్నదమ్ములు అనంతలోకాలకు వెళ్లిపోయారు. తమ్ముళ్లు ప్రదీప్, అరవింద్‌లను స్కూల్‌లో విడిచిపెట్టడానికి 20 ఏళ్ల రాకేశ్ ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కానీ, మార్గమధ్యలోనే ఓ Lorry వల్ల రోడ్డ ప్రమాదం జరిగింది. ఇందులో వాహనం నడుపుతున్న రాకేశ్ అక్కడికక్కడే మరణించాడు. ఆయన ఇద్దరు తమ్ముళ్లను హాస్పిటల్ తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు విడిచారు. మెదక్ జిల్లా Cheguntaలోని జీవిక పరిశ్రమ వద్ద సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సినీ ఫక్కిలో దోపిడీ.. భార్యగా మెట్టినింటికీ.. అంతలోనే నగదు సర్దుకుని పరార్

చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లికి చెందిన పండ్ల రాకేశ్(20), సొంత తమ్ముడైన ప్రదీప్(15), వరుసకు తమ్ముడైన పండ్ల రాజు(14)ను బైక్‌పై ఎక్కించుకుని చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దింపడానికి బయల్దేరాడు. కానీ, చేగుంట శివారులోని జీవిక పరిశ్రమ వద్దకు రాగానే గేటు లోపలి నుంచి ఆకస్మికంగా లారీ బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రదీప్, రాజులను హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయారు.

రాకేశ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఆయన తమ్ముడు ప్రదీప్ 10వ తరగతి విద్యార్థి. కాగా, పండ్ల రాజు 8వ తరగతి చదువుతున్నారు. రాకేశ్, ప్రదీప్ తండ్రి, రాజు తండ్రులు గతంలోనే మరణించారు. దీంతో ఇంటి బాధ్యతలు తల్లులే మోస్తున్నారు. బిడ్డలనే కళ్లలో పెట్టుకుని బతుకు భారాన్ని మోస్తున్నారు. ఎదుగుతున్న పిల్లలే వారి ధైర్యం. కానీ, రోడ్డు ప్రమాదంలో చేతికి అందవస్తున్న పిల్లలూ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.

Road Accident: అమెరికాలో కారు యాక్సిడెంట్.. జనగామ జిల్లా వాసి తనయుడు దుర్మరణం
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే