మంథనిలో ఘోర రోడ్డుప్రమాదం... బస్సు, డిసిఎం వ్యాన్ ఢీ, 24మందికి తీవ్రగాయాలు

By Arun Kumar PFirst Published Nov 14, 2021, 12:55 PM IST
Highlights

ఆర్టిసి బస్సును డిసిఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రయాణికులతో పాటు ఆర్టిసి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

మంథని: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సును డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్, డిసిఎం డ్రైవర్ గాయపడ్డారు.  

ప్రమాదానికి సంబంధించి క్షతగాత్రులు, ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలలో ప్రయాణికులను ఎక్కించుకున్న ఆర్టిసి బస్సు కరీంనగర్ కు బయలుదేరింది. ఈ క్రమంలో peddapalli district మంథని ప్లైఓవర్ సమీపంలోని మూలమలుపు వద్ద వేగంగా వచ్చిన ఓ డిసిఎం వ్యాన్ బస్సును ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో వచ్చి మలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో డిసిఎం బస్సును ఢీకొట్టి ఆగింది. 

పెద్దపల్లి-కరీంనగర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 24మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన క్షతగాత్రులను బస్సులోంచి బయటకు తీసుకువచ్చి హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో కొందరు తీవ్రంగా గాయపడగా వారిని కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. 

read more  పెళ్లైన మూడు నెలలకే.. విహారానికి వెళ్లి నవవధువు మృతి..

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోడ్డుపైనే బస్సు, డిసిఎం ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ వాహనాలకు రోడ్డుపైనుండి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. 

అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిసిఎం వ్యాన్ డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఈ నెలలోనే తెలంగాణ ఆర్టిసికి చెందిన మరో రెండు బస్సులు కూడా ప్రమాదానికి గురయ్యాయి. గత బుధవారం సాయంత్రం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై స్కూల్ విద్యార్థులతో వెళుతున్న TSRTC బస్సు ప్రమాదానికి గురయ్యింది.  బస్సును వెనకవైపునుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 105మంది విద్యార్థులు వుండగా వీరిలో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 

janagaon bus depot కు చెందిన ఆర్టిసి బస్సు వెల్ది ఆదర్శ పాఠశాల విద్యార్థులతో వెలుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. hyderabad-warangal జాతీయ రహదారిపై వెళుతుండగా రఘునాధపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వెనకనుండి మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బస్సులు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ ఉప్పలయ్య, కండక్టర్ లీలతో పాటు తొమ్మిదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 

 ఇటీవల ఇదే జనగామ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 10మంది ప్రయాణికులతో పాటు బస్ డ్రైవర్, కండక్టర్ కు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి TSRTC కి చెందిన Bus ప్రయాణికులతో జగద్గిరిగుట్టకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.   

ఓవైపు తెలంగాణ ఆర్టిసిని చక్కదిద్దేందుకు ఇటీవలే ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఓవైపు ప్రయత్నిస్తుంటే తరచూ బస్సులు ప్రమాదానికి గురవుతూ ప్రయాణికుల భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో ముందుగా ప్రమాదాల నివారణకు నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు ఆర్టిసి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిసి యాజమాన్యం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది.  

 

click me!