
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం (paddy) దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ (trs)- బీజేపీ (bjp) నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy).. తెలంగాణ సర్కార్‌పై (telangana govt) విరుచుకుపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ, ఆయుష్మాన్ భారత్, ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. పావలా వడ్డీ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుండా ఒక్క హుజూరాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని కేంద్రమంత్రి ప్రశ్నించారు. యాదాద్రి (yadadri) వరకు ఎంఎంటీఎస్ (mmts) ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఏ రైతు అయినా బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేస్తున్నారా.. బాయిల్డ్ రైస్ అనేది రైస్ మిల్లర్ల సమస్య అని ఆయన అన్నారు. దశలవారీగా బాయిల్డ్ రైస్ (boiled rice) తగ్గించాలని కేంద్రం చెబుతూ వచ్చిందని... రైస్ మిల్లర్లతో మాట్లాడకుండా రైతులను, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ధర్నా చౌక్ వద్దు అన్న వాళ్లే ధర్నా చేశారని... మంత్రులు కూడా ధర్నా చేయడం చాలా సంతోషమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించడానికి నోరెలా వచ్చిందంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అబద్దాల ప్రచారం మీద ప్రభుత్వాలు నడపొద్దని.. మోడీ ప్రభుత్వం (modi govt) ఎక్కడా అప్పులు చేసి కమీషన్లు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ALso Read:రైతులను మోసం చేస్తే బాగుపడరు.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్..!
రామప్పకు యునెస్కో (ramappa unesco world heritage site) గుర్తింపు తేవడానికి కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని.. ప్రగతి భవన్‌లో పడుకొని 19 దేశాలను ఒప్పించావా అంటూ కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్రాలను ప్రతిపాదనలు కోరామని.. మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారో , లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ అంటోందని... బీబీనగర్ ఎయిమ్స్ (bibinagar aiims) తెలంగాణలో లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పంతాలు.. పట్టింపులు మాని రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భవనాలు అప్పగించాలని కేంద్ర మంత్రి కోరారు.
ఇకపోతే బిర్సాముండా (birsa munda) జయంతి రోజు (నవంబరు 15) న జాతీయ గిరిజన దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి చెప్పారు. అల్లూరి, కొమురం భీం పోరాటాలకు సరైన గుర్తింపు దక్కలేదని... రాష్ట్రంలో ట్రైబల్ మ్యూజియానికి (tribal museum) రూ.15 కోట్లు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే రూ.కోటి విడుదల చేశామని.. అలాగే వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క.. సారలమ్మ జాతరకు (sammakka sarakka) కేంద్రం నిధులు ఇస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.