క్లాస్ రూం తలుపులు, కిటికిలు మూసేసి... విద్యార్థిణులతో గిరిజన అధికారి అసభ్య ప్రవర్తన

By Arun Kumar PFirst Published Nov 14, 2021, 7:52 AM IST
Highlights

తాగిన మైకంలో పాఠశాలకు రావడమే కాదు  క్లాస్ రూం తలుపులు, కిటికిలు మూసేసి తమతో డిటిడివో అసభ్యంగా ప్రవర్తించాడని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిణులు ఆందోళనకు దిగారు. 

మంచిర్యాల: విద్యార్థుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సినవాడే వారికి సమస్యగా మారాడు. విద్యార్థిణులతో తన ఎదుట పాటలు పాడుతూ డ్యాన్స్ చేయాలని వేధింపులకు దిగాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... mancherial లోని చున్నంబట్టివాడ సాయికుంటలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కొందరు విద్యార్థిణులు చదువుకుంటున్నారు. హాస్టల్లో వుంటూ చదువుకుంటున్న ఈ గిరిజన విద్యార్థుల బాగోగులు చూడాల్సిన గిరిజన సంక్షేమ అధికారి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. మద్యంమత్తులో పాఠశాలకు వచ్చిన సదరు అధికారి క్లాసుల పేరిట విద్యార్థిణిలను క్లాస్ రూంలో తలుపులు, కిటికిలు  మూసివేసి వేధింపులకు దిగాడు. 

ముఖ్యంగా 9,10 తరగతి విద్యార్థిణిలపై డిటిడివో జనార్ధన్ వేధింపులకు దిగాడు. బోధన పేరిట రాత్రివరకు వారిని పాఠశాలలోనే వుంచడమమే కాదు కొందరిపై చేయిచేసుకున్న అతడు బాలికలందరిని భయపెట్టాడు. తనకు నచ్చినట్లు నడుచుకోకుండే చంపేస్తానని వారిని బెదిరించాడు. తాను మళ్లీ వస్తానని... అప్పుడు పాటలు పాడుతూ  తన ఎదుట డ్యాన్స్ లు చేయాలని బాలికలను ఆదేశించాడు. 

read more  ఇద్దరు పిల్లల తల్లి.. భర్త వద్దు రాందాస్ తోనే ఉంటానంటూ పీఎస్ కు.. చివరికి...

డిటిడివో harassment తో విసిగిపోయిన బాలికలు ఆందోళనకు దిగారు. తమపట్ల అధికారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని... చంపేస్తానని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేసారు.  తమను వేధిస్తున్న అధికారిని వెంటనే విధుల నుండి తొలగించాలంటూ విద్యార్థిణులు ఆందోళన చేపట్టారు. 

అయితే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకునివెళతానని స్కూల్ ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో బాలికలు ఆందోళనను విరమించారు. అయినా తమకు న్యాయం జరగలేదంటూ శనివారం మరోసారి విద్యార్థిణులు అల్పాహారం తినకుండా నిరసన తెలిపారు. 

read more  Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం.. ఆస్పత్రికి వచ్చిన యువతితో టెక్నీషియన్ అసభ్య ప్రవర్తన..

హాస్టల్ బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  విద్యార్థిణిలతో మాట్లాడిన వారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విద్యార్థిణులు విరమించారు. 

బాలికలపై ప్రధానోపాధ్యాయుడి వేధింపులు... 

ఇదిలా ఉండగా సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కామంతో కళ్లు మూసుకుపోయిన  ప్రధానోపాధ్యాయుడు ఇలాంటి అకృత్యానికే తెగబడ్డాడు. ‘పట్టుకోండి చూద్దాం’ అనే  ఆట పేరుతో బాలికల కళ్ళకు గంతలు కడతాడు. పిల్లలతో కలిపి తాను ఆడుతున్నట్లు గా నటిస్తూనే కళ్ళకు గంతలు కట్టి ఉన్న బాలికలను ఏమార్చి స్టోర్ రూంలోకి తీసుకు వెళ్తాడు. అక్కడ వారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. 

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఇప్పటివరకు  నలుగురు చిన్నారులపై Sexual assaultకి పాల్పడినట్లు వారి తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. బాధితులంతా మూడు, నాలుగు తరగతి చదువుతున్న పిల్లలే. బడికి వెళ్లేందుకు ఆ చిన్నారులు భయపడుతుండటంతో వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని Parents ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. నిందితుడు, అక్కడ Principalగా పనిచేస్తున్న అనిల్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.  

చింతలపాలెం ఎస్సై రంజిత్ రెడ్డి, బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ. ఆ పాఠశాలలో ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 28 ఏళ్ల అనిల్ కు గత ఏడాది  పెళ్లయింది. మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. 


 

click me!