Hyderabad Accident: ట్యాంక్ బండ్ పై ప్రమాదం... అమాంతం గాల్లో ఎగిరి హుస్సెన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

Arun Kumar P   | Asianet News
Published : Nov 28, 2021, 11:45 AM ISTUpdated : Nov 28, 2021, 11:56 AM IST
Hyderabad Accident: ట్యాంక్ బండ్ పై ప్రమాదం... అమాంతం గాల్లో ఎగిరి హుస్సెన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

సారాంశం

నాలుగురోజుల క్రితమే కొన్న కొత్తకారు ట్యాంక్ బండ్ పై ప్రమాదానికి గురయ్యింది. కారు అమాంతం గాల్లో ఎగిరి హుస్సెన్ సాగర్ జలాశయంలోకి దూసుకెళ్లింది. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున కారు నానా బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళుతున్న కారు ఎన్టీఆర్ పార్క్ వద్ద అదుపుతప్పి హుస్సెన్ సాగర్ జలాశయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో కారులోనే వున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. hyderabad లోని ఖైరతాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు నితిన్, స్పత్రిక్ , కార్తీక్ నాలుగు రోజుల క్రితమే తీసుకున్న కొత్తకారులో ఇవాళ(ఆదివారం) ఉదయం టిఫిన్ చేయడానికి అప్జల్ గంజ్ కు బయలుదేరారు. మార్గమధ్యలో ఎన్టీఆర్ పార్క్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. అమాంతం కారు గాల్లోకి ఎగిరి hussain sagar లోకి దూసుకెళ్ళింది. 

tank bund పై వున్నవారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే నీటిలోకి దిగి కారులోని యువకులను కాపాడారు. ముగ్గురు యువకులు స్వల్పంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. 

read more  West Bengal Accident: అంత్యక్రియలకు వెళుతుండగా ఘోర ప్రమాదం... 17మంది దుర్మరణం

ప్రమాదంపై సమాచారం అందుకున్న సైపాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హుస్సెన్ సాగర్ లోంచి కారును బయటకు తీయించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. 

ఇదిలావుంటే హైద్రాబాద్ నగరంలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో సెప్టిక్ ట్యాంక్  శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ లోని విష వాయువుల వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్ లో చాలా కాలంగా ఈ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయలేదు. దీంతో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు నలుగురు కూలీలు పని కోసం వచ్చారు. అయితే  సెప్టిక్ ట్యాంక్ మూత తీయగానే వెలువడిన విష వాయువుల కారణంగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.

read more  గుజరాత్ సమీపంలో రెండు కార్గో షిప్‌లు ఢీ.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అపార్ట్‌మెంట్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం కోసం ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సెప్టిక్ ట్యాంక్  క్లీన్ చేసేందుకు కూలీలు అక్కడికి చేరుకొన్నారు. సెఫ్టిక్ ట్యాంక్ మూత తీయగానే వెలువడిన విష వాయువు కారణంగా ఇద్దరు మరణించినట్టుగా స్థానికులు చెప్పారు.

మరణించిన ఇద్దరు కార్మికులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం గాజీనగర్ తండా వాసులుగా గుర్తించారు. మృతులు హైదరాబాద్ లోని సైదాబాద్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గతంలో కూడా హైద్రాబాద్ లోని పలు చోట్ల సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ పలువురు మృత్యువాత పడిన  ఘటనలు చోటు చేసుకొన్నాయి.

ఇక శనివారం రాత్రి పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల కోసం స్మశానానికి వెళుతుండగా వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీంతో  17మంది దుర్మరణం పాలయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu