
హైదరాబాద్: ఈ కలికాలంలో కూడా కొందరు మనుషుల్లో మానవత్వం, మంచితనం మిగిలివున్నాయని తెలిపేందుకేనేమో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇలా ఓ సామాన్య కార్మికుడి నిజాయితీని తెలియజేసే సంఘటన హైదరాబాద్ శివారులోని కాటేదాన్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... hyderabad Kattedan పారిశ్రామికవాడలోని పోషన్ ఫుడ్ ఇండస్ట్రీలో రణవీర్ సింగ్(41) సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న(శనివారం) poshak foods సంస్థకే చెందిన మరో కంపనీకి రూ.6.3లక్షల రూపాయల బ్యాగ్ తో ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో డబ్బులతో కూడిన బ్యాగ్ పడిపోయినా రణవీర్ చూసుకోకుండా అలాగే వెళ్లిపోయాడు.
అయితే అదే పారిశ్రామికవాడలోని ఓ పాలిమర్ కంపనీలో పనిచేసే కార్మికుడు అశోక్ తివారి(29)కి రోడ్డుపై పడివున్న ఆ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ తెలిచిచూడగా భారీగా డబ్బులు కనిపించాయి. అయినప్పటికి అతడు అత్యాశపడకుండా తనవికాని డబ్బు తనకు వద్దని గొప్పగా ఆలోచించాడు. వెంటనే డబ్బులతో కూడిన బ్యాగ్ ను అలాగే తీసుకునివెళ్లి తాను పనిచేసే కంపనీ యజమానికి అప్పగించాడు.
read more మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్... ఇద్దరు యువకులను కాపాడి
ఇద్దరూ కలిసి మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ కు నగదు బ్యాగ్ అప్పగించేందుకు వెళ్లారు. ఇదే సమయంలో తన డబ్బుల బ్యాగ్ పోయిందని ఫిర్యాదు చేయడానికి రణవీర్ సింగ్ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు అశోక్ కు దొరికిన క్యాష్ బ్యాగ్ రణవీర్ దిగా గుర్తించారు.
ఇలా పోలీస్ స్టేషన్ లో క్యాష్ బ్యాగ్ కు సంబంధించిన వ్యవహారం జరుగుతుండగా సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిశీలను వచ్చారు. లక్షల రూపాయల బ్యాగ్ దొరికినా నిజాయితీతో పోలీస్ స్టేషన్ కు వచ్చి అప్పగిస్తున్న అశోక్, అతడి యజమానికి సిపి ప్రత్యేకంగా అభినందించారు. సిపి దగ్గరుండి అశోక్ చేత డబ్బులు పోగొట్టుకున్న బాధితుడ రణవీర్ కు డబ్బులతో కూడిన బ్యాగ్ ను ఇప్పించారు.
read more రియల్ హీరో సోనూసూద్ కు మరో గుడి.. అభిమానం చాటుకున్న ఖమ్మం వాసి...
ఇలా రోడ్డుపై దొరికిన లక్షల డబ్బులను తిరిగిచ్చిన కార్మికుడు అశోక్ నిజాయితీ గురించి తెలిసినవారుమెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. అత్యాశతో డబ్బులు దాచుకోకుండా డబ్బులు తిరిగిచ్చి మనుషుల్లో మంచితనం మిగిలేవుందని అశోక్ నిరూపించారు.
ఇదిలావుంటే అభం శుభం తెలియని ఓ చిన్నారిని కామాంధుడి బారినుండి కాపాడాడు హైదరబాదీ ఆటోడ్రైవర్. బిక్షాటన చేస్తూ తల్లితో కలిసి ఫుట్ ఫాత్ పై పడుకున్న చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి యత్నించగా ఆటోడ్రైవర్ అడ్డుకున్నాడు. ఇలా చిన్నారిని కాపాడిన సదరు ఆటోడ్రైవర్ ను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించిన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ జ్షాపికను కూడా అందజేసారు.